News December 9, 2025

ఖమ్మం: సాయంత్రం నుంచి అంతా గప్ చుప్

image

జీపీ మొదటి విడత ప్రచారానికి ఇవాళ సాయంత్రంతో తెర పడనుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. ఖమ్మం జిల్లాలో 7 మండలాల్లో 172, కొత్తగూడెం జిల్లాలో 8 మండలాల్లో 159 గ్రామాల్లో ఈ నెల 11న ఎన్నికలు జరగనున్నాయి. పంచాయతీ పోరులో ఎప్పుడూ పెద్దగా కనిపించని బడా నేతలు సైతం ఈ ఎలక్షన్స్‌ను ప్రతిష్ఠాత్మకంగా భావించి తమ మద్దతు దారుల తరఫున ఓట్లు అభ్యర్థించారు.

Similar News

News December 11, 2025

ఎన్టీఆర్ కలెక్టర్‌కు సీఎం ఇచ్చిన ర్యాంక్ ఎంతంటే.!

image

రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ల పనితీరును అంచనా వేసే ఈ-ఫైల్ డిస్పోజల్ రిపోర్ట్ విడుదలైంది. గత మూడు నెలల కాలానికి సంబంధించి విడుదలైన ఈ నివేదికలో ఎన్టీఆర్ జిల్లా 23వ స్థానంలో నిలిచింది. కలెక్టర్ లక్ష్మీశా మొత్తం 538 ఈ-ఫైళ్లను స్వీకరించగా, 581 ఈ-ఫైళ్లను ఫార్వర్డ్‌, క్లోజ్‌, మెర్జ్‌ చేయడం జరిగింది. పరిపాలనలో డిజిటల్‌ విధానాల అమలులో జిల్లా పనితీరుపై ఈ నివేదిక స్పష్టతనిచ్చింది.

News December 11, 2025

ఫ్లైట్ జర్నీలో సమస్యలుంటే ఇలా చేయండి

image

ఇండిగో సేవలు సాధారణస్థితికి వచ్చినా కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ‘ప్రయాణికుల కంప్లైంట్స్ రియల్ టైమ్ పరిష్కారం కోసం క్రమం తప్పకుండా నిఘా ఉంచుతున్నాం. ఏదైనా సమస్య ఉంటే Xలో @MoCA_GoIని ట్యాగ్ చేయండి. కంట్రోల్ రూమ్‌ను 011-24604283/011-24632987 నంబర్‌లలో సంప్రదించండి. AirSewa యాప్/వెబ్ పోర్టల్‌లోనూ ఫిర్యాదు చేయొచ్చు’ అని ట్వీట్ చేశారు.

News December 11, 2025

వృద్ధురాలిపై అత్యాచారం.. నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష

image

60 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి సిద్దిపేట కోర్టు 10 ఏళ్ల జైలు శిక్ష విధించినట్లు పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ తెలిపారు. చిన్నకోడూరు మండలం గ్రామానికి చెందిన వృద్ధురాలిని అదే గ్రామానికి చెందిన కొమ్ము నరసయ్య తన వాహనంపై తీసుకెళ్లి అత్యాచారం చేశాడన్నారు. ఈ కేసులో నిందితునికి 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించినట్లు సీపీ పేర్కొన్నారు.