News January 16, 2026

ఖమ్మం: సీఎం పర్యటన ఏర్పాట్లు పూర్తి చేయాలి

image

ఖమ్మం జిల్లాలో జనవరి 18న జరగనున్న సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనను దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లు నిబంధనల ప్రకారం చేపట్టాలని జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ పి.శ్రీజ అధికారులను శుక్రవారం ఆదేశించారు. కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌తో కలిసి నిర్వహించిన సమీక్షలో హెలిప్యాడ్, భద్రత, కాన్వాయ్ వాహనాలు, వైద్య సదుపాయాలు, అగ్నిమాపక ఏర్పాట్లు ప్రోటోకాల్ మేరకు ఉండాలని సూచించారు.

Similar News

News February 20, 2026

యాక్సెంచర్ కొత్త రూల్: AI వాడితేనే ప్రమోషన్.. లేదంటే నో ఛాన్స్!

image

ప్రమోషన్ కావాలంటే కంపెనీకి చెందిన AI టూల్స్ వాడటం తప్పనిసరని యాక్సెంచర్ తమ ఉద్యోగులకు తేల్చి చెప్పింది. సీనియర్ మేనేజర్లు, అసోసియేట్ డైరెక్టర్లు తమ రోజువారీ పనిలో AI టూల్స్ వాడుతున్నారో లేదో HR విభాగం ఇకపై నిశితంగా గమనించనుంది. ఇందుకోసం వారు వారానికి ఎన్నిసార్లు లాగిన్ అయ్యారో ట్రాక్ చేస్తోంది. AIకి అలవాటు పడని వారు కంపెనీ నుంచి బయటకు వెళ్లాల్సిందేనని గతంలోనే CEO జూలీ స్వీట్ హెచ్చరించారు.

News February 20, 2026

PDPL: SMలో పోస్టులు పెట్టకపోతే బతికేదేమో..!

image

HYD వనస్థలిపురంలో గర్భిణిని మాజీ భర్త చంపడానికి ప్రధాన కారణం SMలో పెట్టిన పోస్టులేనని తెలిసింది. మహారాష్ట్రవాసి సునీత, PDPL మంథనివాసి మహేశ్ 2022లో పెళ్లి చేసుకున్నారు. మనస్పర్ధలతో 2024లో లీగల్‌గా విడిపోయారు. ఆపై HYDలో పరిచయమైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ శ్రీనాథ్‌ను సునీత రెండోవివాహం చేసుకుని తానిప్పుడు హ్యాపీగా ఉన్నట్లు SMలో పోస్టులు పెట్టింది. ఇవిచూసి రగిలిపోయిన మహేశ్ మాజీ భార్యను <<19175516>>బుధవారం హత్య<<>> చేశాడు.

News February 20, 2026

ముడతలను ఇలా తగ్గించుకోండి

image

వయసు పెరిగే కొద్దీ చర్మం పొడిబారి ముడతలు వస్తుంటాయి. కానీ ప్రస్తుతం చిన్నవయసులోనే ముఖంపై ముడతలు వస్తున్నాయి. వీటిని నివారించడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. ఎండలోకి వెళ్లే ముందు తప్పనిసరిగా సన్‌స్ర్కీన్‌ లోషన్ రాసుకోవడం, హైడ్రేటెడ్‌గా ఉండటం, విటమిన్‌C, ఒమేగా-3 ఫ్యాటీయాసిడ్స్ ఉన్న ఫుడ్స్ తీసుకోవడం, ఫేషియల్‌ ఎక్సర్‌సైజులు చేయడం వల్ల ఈ సమస్యను తగ్గించొచ్చని చెబుతున్నారు.