News January 7, 2026
ఖమ్మం: సీఎం సమక్షంలో మరో ముగ్గురు కార్పొరేటర్ల చేరిక

ఖమ్మంలో బీఆర్ఎస్ ముగ్గురు కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరారు. హైద్రాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి వీరికి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. మంత్రి తుమ్మల ఆధ్వర్యంలో వీరి చేరిక జరిగింది. ఇటీవల కాలంలో ఐదుగురు చేరగా.. ఇప్పుడు ముగ్గురు కార్పొరేటర్లు చేరారు. దీంతో 40 మంది కార్పొరేటర్లతో ఖమ్మం కార్పొరేషన్‌లో కాంగ్రెస్ బలంగా మారింది.
Similar News
News February 6, 2026
రేపే నవోదయ ప్రవేశ పరీక్ష

పాలేరు జవహర్ నవోదయ విద్యాలయంలో 9, 11తరగతుల్లో ప్రవేశాల కోసం శనివారం పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 9వ తరగతి ప్రవేశానికి 505 మంది, 11వ తరగతికి 797 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్ష ఉదయం 11:15 గంటల నుంచి మధ్యాహ్నం 1:45 గంటల వరకు జరుగుతుందని ప్రిన్సిపల్ తెలిపారు. అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.
News February 5, 2026
ఖమ్మం జనరల్ ఆసుపత్రి వసతులపై కలెక్టర్ సమీక్ష

ఖమ్మం జనరల్ ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా వసతులు అభివృద్ధి చేయాలని కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. ఆసుపత్రి పని తీరు, పెండింగ్ అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ నెలాఖరుకు సీవరేజ్, టాయిలెట్ పనులు పూర్తి చేయాలని, 7 రోజుల్లో లిఫ్ట్ మరమ్మతులు చేయాలని సూచించారు. ఓపీ సేవల కోసం ముగ్గురు డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించాలని, మార్చి 15 నాటికి స్టఫ్ పనులు పూర్తి చేయాలన్నారు.
News February 5, 2026
ఖమ్మం RTO కార్యాలయంలో ‘నకిలీ’ దందాపై ఫోకస్

ఖమ్మం RTO ఆఫీస్‌లో వెలుగుచూసిన నకిలీ ఆధార్ కార్డుల వ్యవహారంపై విచారణ చేపట్టినట్లు RTO ధర్మపురి జగదీష్ వెల్లడించారు. ఇప్పటికే బాధ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. అయితే, ఏళ్లతరబడి పాతుకుపోయిన కొందరు సిబ్బంది అండదండలతోనే ఈ అక్రమాలు సాగుతున్నట్లు విమర్శలొస్తున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి కార్యాలయాన్ని ప్రక్షాళన చేయాలని, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు డిమాండ్ చేస్తున్నారు.


