News November 21, 2025
ఖమ్మం: ‘సీడ్స్ ప్రొడక్షన్ చేస్తున్న ఆర్గనైజర్లపై చర్యలు తీసుకోండి’

ఉమ్మడి జిల్లాలో ఆడ, మగ మొక్కజొన్న సీడ్స్ ప్రొడక్షన్ చేస్తున్న ఆర్గనైజర్ల విషయంపై వ్యవసాయ శాఖ కమిషనర్ గోపికి భారతీయ గోర్ బంజారా పోరాట సమితి అధ్యక్షుడు రవిచందర్ ఫిర్యాదు చేశారు. అమాయక గిరిజనులను లక్ష్యంగా చేసుకొని, అనుమతులు లేకుండా వ్యాపారాలు చేస్తూ నష్టపరుస్తున్నారని తెలిపారు. ఈ విషయంలో తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Similar News
News November 22, 2025
భారీగా పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,860 పెరిగి రూ.1,25,840కు చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,700 ఎగబాకి రూ.1,15,350 పలుకుతోంది. అటు కేజీ వెండి ధరపై రూ.3,000 పెరిగి రూ.1,72,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News November 22, 2025
గజ్వేల్: అందని వైద్య సేవలు..!

వయోవృద్ధుల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా ప్రారంభించిన ఎల్డర్లీ హెల్త్ కేర్ కార్యక్రమం నామమాత్రంగా మారింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టిన ఈ కార్యక్రమం ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా విస్తరించారు. వృద్ధులకు ఆయా రకాలైన వైద్య పరీక్షలతో పాటు ఉచితంగా మందులు అందించారు. కానీ ప్రస్తుతం ఎన్సీడీ(నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్)లో విలీనం చేయడంతో వృద్ధులకు సేవలు నిలిచిపోయాయి.
News November 22, 2025
NLG: రిజర్వేషన్ కలిసివచ్చేనా!?

జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ వేగంగా సాగుతోంది. గ్రామం, వార్డు రిజర్వేషన్లు ఏది అవుతుందోనని ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం కలెక్టరేట్లో ఆర్డీవో, ఎంపీడీవోలు, పంచాయతీ కార్యాలయ సిబ్బంది రిజర్వేషన్ల కసరత్తును ప్రారంభించారు. ప్రస్తుతం ప్రభుత్వం పాత కేటగిరిల్లో రిజర్వేషన్లు అమలు చేస్తుండడంతో రిజర్వేషన్ కలిసి వస్తుందా? లేదా అనే ఆందోళన కనిపిస్తుంది.


