News December 27, 2025

ఖమ్మం: సొంత పార్టీ నేతలపైనే ‘హస్తం’ ఎమ్మెల్యేల ఫిర్యాదు

image

ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పార్టీలో ఉంటూనే ప్రత్యర్థి వర్గాలకు సహకరించారని వారిపై పలువురు MLAలు ఏఐసీసీకి ఫిర్యాదు చేయడం రాజకీయంగా దుమారం రేపుతోంది. ఇప్పటికే MLAలు మట్టా రాగమయి దయానంద్, పాయం వెంకటేశ్వర్లు, మాజీ MLA పొదెం వీరయ్య బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేయగా.. ఇదే అంశాన్ని CM, Dy.CM దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు సమాచారం.

Similar News

News January 5, 2026

NLG: టెట్ అభ్యర్థులకు తప్పని తిప్పలు

image

టెట్ అభ్యర్థులకు పరీక్షా కేంద్రాల కేటాయింపు ఇబ్బందిగా మారింది. మొదటి రోజే అప్లై చేసినా, ప్రాధాన్యత క్రమంలోని చివరి పట్టణాల్లో కేంద్రాలు కేటాయించడంతో అభ్యర్థులు వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. దీంతో ఒక రోజు ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకుంటున్నారు. జిల్లా నుంచి 1,557 మంది ఉపాధ్యాయులతో సహా సుమారు 3 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 4న ప్రారంభమైన పరీక్షలు 20వ తేదీ వరకు కొనసాగనున్నాయి.

News January 5, 2026

వరంగల్: తక్కువకు అమ్మితే రూ.5 లక్షల జరిమానా

image

WGLలో లిక్కర్ మార్టులు సిండికేట్‌గా మారిపోయాయి. వైన్స్ షాపుల కంటే MRPలపై తక్కువ ధరలకు లిక్కర్ మార్టుల్లో అమ్మేవాళ్లు. ప్రస్తుతం కొత్త టెండర్ల ద్వారా షాపులను దక్కించుకున్న మద్యం వ్యాపారులు సిండికేట్‌గా మారిపోయారు. ఓ అధికార పార్టీ నేత అండదండలతో సిండికేట్ ఏర్పాటు చేశారు. తలా రూ.5లక్షలను లిక్కర్ మార్ట్ యజమానులు డిపాజిట్ చేశారు.ఎవరైనా తక్కువ ధరలకు విక్రయిస్తే ఆ రూ.5లక్షలను జప్తు చేయాలని డిసైడ్ అయ్యారట.

News January 5, 2026

తండ్రైన క్రికెటర్ అంబటి రాయుడు

image

తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు తండ్రయ్యారు. ఆయన భార్య విద్య మగ పిల్లాడికి జన్మనిచ్చారు. వారిద్దరితో దిగిన సెల్ఫీ ఫొటోను రాయుడు ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. కాగా విద్యను రాయుడు 2009లో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన పలు లీగుల్లో ఆడుతూ క్రికెట్ కామెంటరీ కూడా చేస్తున్నారు.