News January 22, 2026

ఖమ్మం: సోషల్ మీడియాపై పోలీసుల నజర్.. జర జాగ్రత్త..!

image

సోషల్ మీడియాపై పోలీసులు నిఘా పెట్టారు. ఎవరైనా సరే అనుచిత, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్, సీఎం రేవంత్ రెడ్డిపై సోషల్ మీడియాలో అనుచిత, అసభ్య వ్యాఖ్యలు చేసిన రంగా ప్రవీణ్‌ను ఖమ్మం త్రీటౌన్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో ఇతరుల మనోభావాలను దెబ్బతీసేలా పోస్టులు చేయొద్దని ఉమ్మడి ఖమ్మం పోలీసులు సూచిస్తున్నారు.

Similar News

News February 14, 2026

బీఆర్ఎస్ కంటే మెరుగైన ఫలితాలు సాధించాం: ఎమ్మెల్సీ

image

మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కంటే బీజేపీ మెరుగైన ఓట్ షేర్ సాధించిందని ఎమ్మెల్సీ మల్క కొమరయ్య పేర్కొన్నారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్రమంత్రి బండి సంజయ్‌తో కలిసి ఆయన మాట్లాడారు. కరీంనగర్ కార్పొరేషన్‌లో విజయం చరిత్రాత్మకమని, కాంగ్రెస్, బీఆర్ఎస్ కుట్రలు చేసినా ప్రజలు బీజేపీని ఆదరించారని తెలిపారు. రాబోయే కాలంలో తెలంగాణలో బీజేపీనే అధికారంలో ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

News February 14, 2026

ప్రేమికుల దినోత్సవం.. FBలో కొండా మురళి పోస్ట్!

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ‘కొండా’ కపుల్‌ది మంచి లవ్ స్టోరీ. వరంగల్ ఎల్బీ కళాశాలలో మొదలైన వీరి పరిచయం ప్రేమికుల రోజున సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. వాలెంటైన్స్ డే సందర్భంగా కొండా మురళి తన ఫేస్‌బుక్ ఖాతాలో భార్య సురేఖతో ఉన్న పాత చిత్రాలను పంచుకున్నారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్న సురేఖ, మాజీ ఎమ్మెల్సీ మురళిల అపూర్వ బంధంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

News February 14, 2026

T20WC నుంచి ఒమన్ ఔట్

image

ఇవాళ ఐర్లాండ్‌ చేతిలో ఓటమితో T20WC-2026 నుంచి ఎలిమినేట్ అయిన తొలి జట్టుగా ఒమన్ నిలిచింది. గ్రూప్-Bలో ఉన్న ఆ జట్టు లీగ్ దశలో ఆడిన 3 మ్యాచుల్లోనూ ఓడింది. దీంతో మరొక మ్యాచ్ మిగిలి ఉండగానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇదే గ్రూపులో శ్రీలంక, జింబాబ్వే ఆడిన రెండు మ్యాచుల్లోనూ విజయాలతో 1, 2 స్థానాల్లో కొనసాగుతున్నాయి. అటు లీగ్ దశలో ఒమన్ తన చివరి మ్యాచ్‌ను FEB 20న ఆస్ట్రేలియాతో ఆడనుంది.