News November 21, 2025

ఖమ్మం: హత్య జరిగి 21 రోజులు.. నిందితుల జాడేదీ?

image

చింతకాని(M) పాతర్లపాడు మాజీ సర్పంచి, CPM నేత సామినేని రామారావు హత్య జరిగి 21 రోజులు అవుతున్నా, సుపారీ గ్యాంగ్‌కు సంబంధించిన నిందితులను పోలీసులు గుర్తించలేకపోతున్నారు. హంతకులు ఆధారాలు లభించకుండా జాగ్రత్త పడ్డారని పోలీసులు చెబుతున్నారు. ఇది రాజకీయ హత్యేనని, దర్యాప్తు జాప్యానికి అధికార పార్టీ ఒత్తిళ్లే కారణమని CPM నాయకులు ఆరోపిస్తున్నారు. దీనికి నిరసనగా ఈనెల 25న దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు.

Similar News

News November 21, 2025

ఇద్దరు హోంగార్డుల మధ్య గొడవ.. సీరియస్ యాక్షన్ తీసుకున్న ప్రకాశం ఎస్పీ!

image

క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడ్డ ఇద్దరు హోంగార్డులను విధుల నుంచి తాత్కాలికంగా తప్పిస్తూ ఎస్పీ హర్షవర్ధన్ రాజు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పెద్దారవీడుకు చెందిన హోంగార్డ్ యాసిన్, దోర్నాలకు చెందిన ప్రశాంత్ కుమార్, వెలిగండ్లకు చెందిన బాలసుబ్రమణ్యం విధుల నిమిత్తం 19న ఒంగోలుకు వచ్చి విశ్రాంతి కోసం గదిని తీసుకున్నారు. ప్రశాంత్, సుబ్రహ్మణ్యం గొడవ పడగా, ఇద్దరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు.

News November 21, 2025

NGKL: నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశం కల్పించాలి: ఎంపీ

image

పార్లమెంటు పరిధిలోని నిరుద్యోగ యువతీ యువకులకు బ్యాంకు అధికారులు రుణాలు మంజూరు చేసి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలని ఎంపీ డాక్టర్ మల్లు రవి సూచించారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని గ్రామీణ బ్యాంకు అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. యువత ఆర్థికంగా ఎదగడానికి బ్యాంకు రుణాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. చిన్న, మధ్యతరహా వ్యాపారాలు చేసుకునే విధంగా ప్రోత్సహించాలని కోరారు.

News November 21, 2025

వీరుల గుడిలో పల్నాడు ఎస్పీ ప్రత్యేక పూజలు

image

కారంపూడి వీరుల ఉత్సవాల సందర్భంగా పల్నాడు ఎస్పీ రామకృష్ణారావు శుక్రవారం వీరుల గుడిని సందర్శించారు. పల్నాడు యుద్ధంలో వీరులు వాడిన కొణతాల గురించి పీఠాధిపతి తరుణ్ చెన్నకేశవులును అడిగి తెలుసుకుని ప్రత్యేక పూజలు చేశారు. మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి పల్నాటి వీరుల ఉత్సవాల గురించి ఎస్పీకి వివరించారు.