News July 9, 2024
ఖమ్మం: హోంగార్డ్ ఆఫీసర్స్‌కు ఆర్థిక సహాయం

ఖమ్మం జిల్లాలోని హోంగార్డు ఆఫీసర్స్‌కు ఆర్థిక సహాయాన్ని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అందజేశారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కోనే హోంగార్డులకు అదేవిధంగా హోంగార్డు కుమార్తెల వివాహలు కోసం మంజురైన, ఆర్థిక సహాయాన్ని పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ నగదు చెక్కులను పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా అందుకున్న వారిలో హోంగార్డు ఆఫీసర్లు వెంకటేశ్వర్లు, ఉపేందర్, నవీన్, కోటేశ్వరరావు, కిషన్ ఉన్నారు.
Similar News
News February 18, 2026
ఖమ్మం: న్యాయవాది నుంచి కౌన్సిలర్‌గా

కోర్టులో కేసులు వాదించే స్థాయి నుంచి ప్రజల పక్షాన నిలిచే ప్రజాప్రతినిధిగా అడ్వకేట్ దండి శ్రీజ బాధ్యతలు చేపట్టారు. ఎదులాపురం మున్సిపాలిటీ 30వ వార్డు కౌన్సిలర్‌గా సీపీఐ తరపున విజయం సాధించి ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో ఖమ్మం జిల్లాలో న్యాయవాదిగా సేవలందించిన శ్రీజ, ఇప్పుడు ప్రజలకు న్యాయం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతానని తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, మిత్రులు ఆమెను అభినందించారు.
News February 18, 2026
ఖమ్మం: సీతారామ ప్రాజెక్టు కోసం కలెక్టర్ చొరవ!

ఖమ్మం (D)లో సీతారామ ఎత్తిపోతల పథకం 13వ ప్యాకేజీ పనులను వేగవంతం చేసేందుకు కలెక్టర్ అనుదీప్ రంగంలోకి దిగారు. బాజుమల్లాయిగూడెం, రేలకాయలపల్లి రైతులతో సమావేశమై భూసేకరణపై చర్చించారు. నిబంధనల మేరకు గరిష్ఠ పరిహారంతో పాటు పంటలు, నిర్మాణాలకు సంబంధించిన నష్టపరిహారాన్ని నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేశామని స్పష్టం చేశారు. ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసేందుకు రైతులందరూ సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
News February 18, 2026
ఖమ్మం: ప్రభుత్వ ఐటీఐలో ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

ఖమ్మం ప్రభుత్వ ఐటీఐలో పీఎంకేవీవై 4.0 పథకం కింద సీఎన్సీ టర్నింగ్ ఆపరేటర్, డ్రోన్ టెక్నీషియన్ కోర్సుల్లో ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఏ. శ్రీనివాసరావు తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఫిబ్రవరి 21 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆసక్తి గల వారు ఎస్సెస్సీ మెమో, ఆధార్ కార్డుతో ఐటీఐలో సంప్రదించాలని కోరారు.


