News February 12, 2026

ఖమ్మం: 116 వార్డుల్లో సంగ్రామం.. రేపే తేలనున్న భవితవ్యం

image

జిల్లాలోని 116 వార్డులకు పోటీ చేసిన అభ్యర్థుల జయాపజయాలు ఈనెల 13న కౌంటింగ్‌ అనంతరం తేలనుంది. జిల్లావ్యాప్తంగా బుధవారం జరిగిన పోలింగ్‌లో 82.5% ఓటింగ్‌ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 1,41,875 మంది ఓటర్లకు గానూ 1,17,043 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసిన వారిలో 55,506 మంది పురుషులు, 61,520 మంది మహిళలతో పాటు 17 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. 24,832 మంది ఓటర్లు గైర్హాజరయ్యారు.

Similar News

News February 17, 2026

GMA గ్లోబల్ అధ్యక్షుడిగా ఖమ్మం వాసి

image

గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ (GMA) అధ్యక్షుడిగా ఖమ్మం నగరానికి చెందిన విజయ్ దండ్యాల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అమెరికాలో ఐటీ కంపెనీ సీఈఓగా ఉన్న ఆయన ఖమ్మం ఐటీ హబ్‌లోనూ బ్రాంచ్ ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తున్నారు. ఆయన ఎంపిక పట్ల జిల్లా మున్నూరు కాపు సంఘం నేతలు హర్షం వ్యక్తం చేశారు.

News February 17, 2026

ఖమ్మం: కలెక్టర్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు!

image

ఖమ్మం కలెక్టరేట్‌లో సోమవారం వివిధ శాఖల పురోగతిపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. అదనపు కలెక్టర్ పి.శ్రీజతో కలిసి రబీ ధాన్యం సేకరణ ఏర్పాట్లు, వేసవిలో తాగునీటి ఎద్దడి కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, రోడ్ సేఫ్టీ పనులు, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

News February 16, 2026

ఏపీ నుంచి ఇసుక రవాణాపై ఖమ్మం సీపీ హెచ్చరిక

image

ఖమ్మం కమిషనరేట్ పరిధిలో ఏపీ నుంచి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు కఠిన చర్యలు చేపట్టాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశించారు. సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి 24 గంటల నిఘా కొనసాగించాలన్నారు. అక్రమ రవాణా, నిల్వలపై కేసులు నమోదు చేసి వాహనాలను జప్తు చేయాలని తెలిపారు. స్థానిక అవసరాలకు మైనింగ్ నిబంధనల ప్రకారం ఇసుక వినియోగించాలని కాంట్రాక్టర్‌లకు సూచించారు.