News February 16, 2026
ఖమ్మం: 20 ఏళ్ల తర్వాత ఇంటికి చేర్చిన ‘రోడ్డు ప్రమాదం’

తిరుమలాయపాలెం మండలం రాజారానికి చెందిన మందుల లాలు 20 ఏళ్ల కిందట ఇల్లు వదిలి వెళ్లిపోయారు. ఎట్టకేలకు ఒక రోడ్డు ప్రమాదం ఆయనను కుటుంబంతో కలిపింది. విజయవాడలో జరిగిన ప్రమాదంలో తీవ్ర గాయాలైన లాలు ఆసుపత్రిలో చేరగా, పోలీసులు ఆయన వివరాలు సేకరించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో 20 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడి, ఆయన క్షేమంగా సొంతింటికి చేరుకున్నారు. ఈ వింత సంఘటన స్థానికంగా అందరినీ ఆశ్చర్యపరిచింది.
Similar News
News February 20, 2026
Pax Silicaలోకి భారత్.. ఏంటీ కూటమి?

భారత్ ‘Pax Silica’ డిక్లరేషన్‌లో చేరింది. సెమీకండక్టర్ సప్లై చైన్, AI వంటి కీలక సాంకేతిక రంగాల్లో అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడమే ఈ ఒప్పంద ఉద్దేశం. గ్లోబల్ చిప్ తయారీలో చైనా ఆధిపత్యాన్ని తగ్గించి, ప్రజాస్వామ్య దేశాల మధ్య సురక్షితమైన, నమ్మదగిన టెక్నాలజీ నెట్‌వర్క్‌ను నిర్మించాలని ఈ కూటమి లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నిర్ణయం ద్వారా భారత్ గ్లోబల్ సెమీకండక్టర్ హబ్‌గా ఎదిగేందుకు సహకారం అందనుంది.
News February 20, 2026
చిత్తూరు: హెల్ప్ లైన్ నెంబర్లు గుర్తుంచుకోవాలి

అత్యవసర సమయాలలో ఉపయోగపడే 112 (ఎమర్జెన్సీ నెంబర్), 1098 (చైల్డ్ హెల్ప్ లైన్) వంటి నెంబర్లను ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని విద్యార్థులకు మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ కరీమున్నీసా సూచించారు. చిత్తూరు విద్యాశ్రమం పాఠశాలలో శుక్రవారం పలు అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులను ఎవరైనా అసౌకర్యంగా తాగితే టీచర్లు, తల్లిదండ్రులకు చెప్పాలన్నారు.
News February 20, 2026
ములుగు: అంతిమ దశలో.. ఆఖరి పోరాటం!

మావోయిస్టు ఉద్యమం అంతిమ దశకు చేరుకుందని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న దండకారణ్యంలో కీలక నేతల ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో ప్రశ్నార్థకంగా మారింది. కేంద్ర మంత్రి అమిత్ షా మార్చి 31కి నక్సలిజాన్ని అంతం చేయడమే లక్ష్యంగా మరోసారి ఆపరేషన్ కగార్-2 ప్రారంభించారు. సమాంతర ప్రభుత్వం నడిపిన నక్సల్స్ ఉద్యమం ఇక చివరి దశకు చేరుకుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.


