News February 20, 2025

ఖమ్మం: 46 కేజీల గంజాయి పట్టివేత

image

ఖమ్మం రైల్వే స్టేషన్‌లో 46 కేజీల గంజాయిని పోలీసులు బుధవారం పట్టుకున్నారు. ఇన్‌స్పెక్టర్ అంజలి తెలిపిన వివరాలు.. రైల్వే స్టేషన్‌లో రైల్వే పోలీసులు సాధారణ తనిఖీలు చేస్తుండగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించగా ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. అతడి వద్ద 46 కేజీల గంజాయి పట్టుబడిందన్నారు. దాని విలువ రూ.11.58 లక్షలు ఉంటుందని ఇన్‌స్పెక్టర్ అంజలి తెలిపారు.

Similar News

News September 17, 2025

HYD: ప్రపంచాన్ని ఆకర్షించేలా మూసీని మారుస్తాం: సీఎం

image

మూసీని శుద్ధి చేసి HYDను సుందరంగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి తేల్చిచెప్పారు. ప్రజాపాలన వేడుకల్లో మాట్లాడుతూ.. మూసీ చుట్టూ బతుకుతున్న ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతామని, మూసీని శుద్ధి చేసి కొత్త ఆర్థిక వ్యవస్థను సృష్టిస్తామన్నారు. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా మూసీ నదిని మారుస్తామన్నారు.

News September 17, 2025

అణుదాడుల బెదిరింపులకు నవ భారత్ భయపడదు: మోదీ

image

పహల్గాం దాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతమైందని ప్రధాని మోదీ అన్నారు. అణుదాడుల బెదిరింపులకు నవ భారత్ భయపడదని స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్‌లో ‘స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. నిజాం అకృత్యాల నుంచి హైదరాబాద్ సంస్థానానికి ఇదే రోజు విముక్తి లభించిందని గుర్తు చేశారు. సర్దార్ వల్లభాయి పటేల్ ధైర్యసాహసాలు ప్రదర్శించి భారత్‌లో విలీనం చేశారని చెప్పారు.

News September 17, 2025

కాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షం

image

TG: రాబోయే 3గంటల్లో నిజామాబాద్, సిద్దిపేట, భువనగిరిలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కొత్తగూడెం, HYD, జగిత్యాల, జనగాం, BHPL, కామారెడ్డి, KNR, ఖమ్మం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్, ములుగు, నాగర్ కర్నూల్, నల్గొండ, నిర్మల్, PDPL, సిరిసిల్ల, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్‌ జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని పేర్కొంది.