News March 30, 2025
ఖమ్మం: 488 కేంద్రాలు.. ఆశలన్నీ బోనస్ పైనే!

ఉమ్మడి జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఖమ్మంలో 2.10 లక్షల ఎకరాల్లో వరికి 344, భద్రాద్రి కొత్తగూడెంలో 65వేల ఎకరాలకు గాను 144 కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సీజన్‌లోనూ సన్నాలకు బోనస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినా, వానాకాలం బోనస్ కొంతమేర పెండింగ్‌లో ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. త్వరలో జమవుతాయని అధికారులు చెబుతున్నారు. దీనిపై మీ కామెంట్
Similar News
News April 1, 2025
సంబేపల్లె: ‘పాడి రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత’

పాడిరైతుల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని కలెక్టర్ శ్రీధర్ చామకూరి అన్నారు. మంగళవారం నాగిరెడ్డిపల్లెలో పశువుల తాగునీటి తొట్టెలు, సేద్యపు నీటి కుంటల నిర్మాణ పనులకు అధికారులతో కలసి భూమిపూజ చేశారు. వేసవిలో భూగర్భ జలాల పెంపునకు ఫారం పాండ్ల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News April 1, 2025
ధోనీపై భారత మాజీ క్రికెటర్ తీవ్ర విమర్శలు

IPL: CSK బ్యాటర్ ధోనీపై మాజీ క్రికెటర్ ఉతప్ప తీవ్ర విమర్శలు చేశారు. RCB, RRతో జరిగిన మ్యాచ్‌ల్లో ధోనీ 9, 7 స్థానాల్లో ఎందుకు బ్యాటింగ్‌కు వచ్చారో అర్థం కావట్లేదన్నారు. మొత్తానికే రాకపోయినా పెద్ద తేడా ఉండేది కాదని ఘాటుగా స్పందించారు. బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుగా వస్తే మ్యాచ్ ఫలితాన్ని మార్చే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ధోనీ తీరుపై ఫ్యాన్స్ సైతం అసహనం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.
News April 1, 2025
ఈ నెలలోనే మెగా DSC నోటిఫికేషన్: సీఎం చంద్రబాబు

AP: ఏప్రిల్ నెలలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. బాపట్ల జిల్లా కొత్తగొల్లపాలెంలో ప్రజావేదిక సభలో ఆయన మాట్లాడారు. జూన్‌లో స్కూళ్లు ప్రారంభమయ్యేలోగా టీచర్ల నియామకం పూర్తి చేస్తామన్నారు. మే నెలలో తల్లికి వందనం అమలు చేస్తామని తెలిపారు. అన్నదాత-సుఖీభవ కింద రూ.20వేలు ఇస్తామని పేర్కొన్నారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణలో ఏపీలో కంటే తక్కువ పెన్షన్ ఇస్తున్నారని అన్నారు.