News January 14, 2026
ఖమ్మం: BRS-YCP, కాంగ్రెస్-TDP మిక్స్‌డ్ పాలిటిక్స్

ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఏపీ-తెలంగాణ పార్టీల కలయిక ఆసక్తి రేపుతోంది. ఈ నెల 7న KTR పర్యటనలో BRS జెండాలతో పాటు YCP జెండాలు కనిపించడం చర్చనీయాంశమైంది. మరోవైపు మంచుకొండ ప్రాజెక్టు వద్ద మంత్రి తుమ్మల సభలో కాంగ్రెస్‌తో పాటు TDP జెండాలు రెపరెపలాడాయి. పొరుగు రాష్ట్రంలో ప్రభావం చూపే పార్టీల మద్దతుదారులు ఇక్కడ స్థానిక పార్టీలతో కలిసి అంటకాగడం ఖమ్మం రాజకీయాల్లో దుమారం రేపుతోంది.
Similar News
News February 21, 2026
పాక్‌లో ‘డెత్ స్క్వాడ్’.. 8 నెలల్లో 924 మంది హతం!

పాకిస్థాన్‌లోని పంజాబ్‌లో నేర నియంత్రణ శాఖ(CCD) డెత్ స్క్వాడ్‌లా మారింది. 2025లో ఏర్పాటైన ఈ విభాగం ఏప్రిల్-డిసెంబర్ మధ్య ఏకంగా 670 ఎన్‌కౌంటర్లు చేసింది. పోలీసు కాల్పుల్లో 924 మంది చనిపోయారు. ఇద్దరు పోలీసులు చనిపోయారని రికార్డుల్లో పేర్కొన్నారు. పాక్ మానవ హక్కుల కమిషన్ ఈ వివరాలు వెల్లడించింది. 8 నెలల్లో సగటున రోజూ 2 కంటే ఎక్కువ ఎన్‌కౌంటర్లు నమోదయ్యాయని, ఒక్క లాహోర్‌లోనే 139 జరిగాయని చెప్పింది.
News February 21, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News February 21, 2026
వెనక్కి తగ్గేది లేదు: ట్రంప్

తాను విధించిన టారిఫ్స్‌ను <<19195677>>రద్దు చేస్తూ<<>> సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మండిపడ్డారు. ఈ నిర్ణయం తీవ్ర నిరాశపరిచిందని, కొంత మంది న్యాయమూర్తులు విదేశీ ప్రయోజనాలకు ప్రభావితమయ్యారని ఆరోపించారు. కోర్టులోని కొంతమంది సభ్యులను చూసి సిగ్గుపడుతున్నానని ఫైరయ్యారు. వాణిజ్య ఎజెండా నుంచి వెనక్కి తగ్గేది లేదని, ఇంకా బలమైన పద్ధతులు తనకు తెలుసని హెచ్చరించారు.


