News October 25, 2025
ఖమ్మం: DCC ఎవరికి దక్కేనో..!

ఖమ్మం, కొత్తగూడెం డీసీసీలు నేడు ఖరారు కానున్నారు. జిల్లా అధ్యక్ష పదవికి గట్టి పోటీ నెలకొంది. ఖమ్మం డీసీసీ పీఠానికి 51 మంది అప్లై చేసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ 50కి పైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. ఏఐసీసీ పరిశీలకులు మహేంద్రన్, జాన్సన్ జిల్లా అగ్ర నేతల అభిప్రాయాలను తెలుసుకుని అధిష్ఠానానికి నివేదించారు. మరి పదవి ఎవరికి దక్కుతుందో అని ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. దీనిపై మీ కామెంట్.
Similar News
News October 25, 2025
ఘోర ప్రమాదం.. బస్సు నడిపింది ఇతనే!

AP: అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా నిన్న కర్నూలు వద్ద బస్సు ప్రమాదం జరిగి 20 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఈ బస్సును పల్నాడు(D) ఒప్పిచర్లకు చెందిన మిరియాల లక్ష్మయ్య నడిపాడు. సాధారణంగా హెవీ లైసెన్స్ కోసం 8వ తరగతి వరకు చదవాల్సి ఉంటుంది. కానీ 5వ తరగతి వరకే చదువుకున్న లక్ష్మయ్య టెన్త్ నకిలీ సర్టిఫికెట్లతో లైసెన్స్ పొందాడు. 2014లోనూ లారీ నడుపుతూ యాక్సిడెంట్ చేయగా ఆ ఘటనలో క్లీనర్ చనిపోయాడు.
News October 25, 2025
తెనాలి అనగానే… ఆ పేరు చెప్పక తప్పదు

తెనాలి పట్టణం సాహిత్యం, సంగీతం, నాటకం, చిత్రకళ, శిల్పకళల కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి ప్రతిభావంతులైన కళాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో గౌరవాలు అందుకుంటున్నారు. ప్రతి వీధిలోనూ సృజనాత్మకత ప్రతిధ్వనిస్తుంటే, కళా ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు పట్టణానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. తెనాలి పేరు వినగానే “కళా కాణాచి” అనిపించుకోవడం ఆనవాయితీ.
@నేడు అంతర్జాతీయ కళాకారుల దినోత్సవం
News October 25, 2025
సిద్దిపేట జిల్లాలో 1715 చెరువులు ఎంపిక

చేప పిల్లల పంపిణీకి జిల్లా మత్స్యశాఖ అధికారులు రంగం సిద్ధం చేశారు. మత్స్యకారుల సొసైటీలకు గ్రామాలలోని చెరువుల్లో చేపలు ఉచితంగా పంపిణీ చేసి, విక్రయించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. జిల్లాలో 379 సొసైటీలుండగా 24,601 మంది సభ్యులు ఉన్నారు. 3,256 చెరువులకు గానూ 1,715 చెరువుల్లో కట్ల, రవ్వ, బంగారుతీగ వంటి రకాలకు చెందిన 4.42 కోట్ల పిల్లలను పంపిణీ చేయాలని ప్రణాళిక సిద్ధం చేశారు.


