News September 11, 2025

ఖమ్మం: KU పీజీ ఫలితాలు విడుదల

image

కాకతీయ యూనివర్సిటీ వివిధ పీజీ పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. ఈ మేరకు ఎంఏ(పొలిటికల్ సైన్స్‌) 4వ సెమిస్టర్‌ మే, ఎంఏ(ఎంసీజే) మొదటి సెమిస్టర్‌ ఏప్రిల్‌, ఎంఎస్సీ(ఇంటిగ్రేటెడ్‌ కెమిస్ట్రీ) 6వ సెమిస్టర్‌ జూన్‌, ఎంఏ(ఇంగ్లిష్‌) మొదటి సెమిస్టర్‌ మార్చి-2025 ఫలితాలను అధికారులు విడుదల చేశారు. ఫలితాలను www.kuexams.org యూనివర్సిటీ వెబ్‌సైట్‌‌లో విద్యార్థులు చెక్ చేసుకోవచ్చు.

Similar News

News September 11, 2025

ఈ దశాబ్దంలో అత్యుత్తమ జట్టుగా ఎదిగాం: RCB

image

బెంగళూరు తొక్కిసలాట ఘటన తర్వాత SM నుంచి విరామం తీసుకున్న RCB కొద్దిరోజులుగా వరుస ట్వీట్స్ చేస్తోంది. తాజాగా IPL లీడర్‌బోర్డ్‌ను షేర్ చేసింది. ‘బర్నింగ్ డిజైర్, కన్సిస్టెంట్ అప్రోచ్, బోల్డ్ ప్రామీస్.. ఈ ప్రయాణమే మనల్ని ఈ దశాబ్దంలో అత్యుత్తమ జట్టుగా నిలబెట్టింది. నిజాయితీ, నమ్మకంతో ఒక్కో మెట్టును పేర్చుతూ నిర్మించుకున్నాం’ అని పేర్కొంది. కాగా 2020 నుంచి RCB 90 మ్యాచ్‌ల్లో 50 విజయాలతో టాప్‌లో ఉంది.

News September 11, 2025

అల్లూరి: హోం స్టేలు ఏర్పాటు చేయడానికి సత్వర చర్యలు చేపట్టాలి

image

ప్రస్తుత పర్యాటక సీజన్‌లో గిరిజన హోం స్టేలు ఏర్పాటు చేయడానికి సత్వర చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ ఆదేశించారు. పర్యాటక ప్రాంతాల్లో మేడ్ ఇన్ అరకు ఉత్పత్తులు విక్రయించడానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు. గురువారం కలెక్టరేట్‌ నుంచి వివిధ శాఖల అధికారులతో వీసీ నిర్వహించారు. పర్యాటకులు గిరిజన గ్రామాల్లో రాత్రి మకాం చేయడానికి అనువుగా ఉండే విధంగా హోం స్టేలను అభివృద్ధి చేయాలని ఆదేశించారు.

News September 11, 2025

HYD: APలో తీగ లాగితే TGలో డొంక కదలింది

image

గొర్రెల స్కాంలో ఈడీ వేగం పెంచింది. బాధితులు ఈ నెల 15న ఈడీ కార్యాలయంలో విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. గొర్రెల స్కామ్‌లో మోసపోయామని ఏపీ గొర్రెలకాపరులు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఈ కేసులో ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. ఏసీబీ విచారణ ఆధారంగా ఈడీ ఎంటర్ అయ్యింది. ఏపీకి చెందిన గొర్రెల కాపరులకు బ్రోకర్లు రూ.2కోట్లు ఎగవేశారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. అక్కడ తీగలాగితే TGలో డొంక కదిలింది.