News March 3, 2025

ఖమ్మం: MLC ఎన్నికలు.. మొదటి రౌండ్ ఫలితాలు

image

WGL-KMM-NLG ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు ఫలితాలను అధికారులు వెల్లడించారు.
1) PRTU అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి – 6,035
2) UTF అభ్యర్థి నర్సిరెడ్డి – 4,820
3) స్వతంత్ర అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి- 4,437
4) స్వతంత్ర అభ్యర్థి పూల రవీందర్- 3,115
5) BJP మద్దతు అభ్యర్థి సరోత్తంరెడ్డి- 2,289
కాగా మొత్తం 19 మంది అభ్యర్థులకు చెల్లిన ఓట్లు 23,641, చెల్లని ఓట్లు 494

Similar News

News November 7, 2025

వర్ధన్నపేట: వడ్లు ఆరబెట్టే యంత్రాలను రైతులు వినియోగించుకోవాలి: కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన డ్రై హెడ్ మిషన్ (వడ్లు అరబెట్టే యంత్రం)లను రైతులు వినియోగించుకోవాలని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదాదేవి సూచించారు. వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్‌ను శుక్రవారం కలెక్టర్ సందర్శించారు. యంత్రాల ద్వారా వడ్లను ఎలా ఆరబెట్టుకోవాలో రైతులకు అవగాహన కల్పించి, ఆధునిక పద్ధతులపై సూచనలు చేశారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ నరకుడు వెంకటయ్య, స్థానిక అధికారులు తదితరులు ఉన్నారు.

News November 7, 2025

‘జర్నలిస్టుపై వైసీపీ నేత అనుచరుల దాడి’

image

సుండుపల్లె మండలం రాచంవాండ్ల పల్లెకు చెందిన జర్నలిస్టు వల్లెపు శ్రీరాములుపై వైసీపీ నేత ఆనంద్ రెడ్డి అనుచరులు శుక్రవారం దాడి చేసినట్లు బాధితుడు ఆరోపించాడు. అనుంపల్లి అటవీ ప్రాంతంలో బైక్‌ను అడ్డగించి రాడ్లు, కర్రలతో కొట్టినట్లు తెలిపాడు. భూ వివాదంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినందుకు ప్రతీకారంగా దాడి చేసినట్లు వాపోయాడు. ఈ ఘటనపై రాయచోటి ఎస్ఐ బాలకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారన్నాడు
.

News November 7, 2025

లక్ష్యాలు పూర్తిచేయని అధికారులపై చర్యలు: కలెక్టర్

image

విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన, నిర్దేశించిన లక్ష్యాలను పూర్తిచేయని అధికారులను ఉపేక్షించేది లేదని, వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ వెట్రిసెల్వి ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారులను హెచ్చరించారు. సంక్షేమ వసతి గృహాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, పర్యాటక శాఖకు చెందిన ప్రదేశాలలో టాయిలెట్ల నిర్మాణ పనులపై ఆర్ డబ్ల్యూ ఎస్, సంక్షేమ శాఖల అధికారులతో కలెక్టర్ శుక్రవారం జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.