News March 13, 2025

ఖమ్మం: MSG ఓపెన్ చేస్తే రూ.మూడున్నర లక్షలు మాయం

image

సైబర్ మోసగాళ్ల వలలో పడి ఓ వ్యక్తి రూ.3.50 లక్షలు పోగొట్టుకున్న ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో జరిగింది. మండల కేంద్రానికి చెందిన పుసులూరి ఉపేందర్ చౌదరి వరి కోత మెషీన్ ఏజెంట్‌గా పని చేస్తున్నారు. 2 రోజుల క్రితం వాట్సాప్ ద్వారా పీఎం కిసాన్ యాప్ అని మెసేజ్ రాగా, దానిని ఓపెన్ చేయడంతో మంగళవారం రూ.3.50 లక్షలు అకౌంట్ నుంచి బదిలీ అయ్యాయని బాధితుడు వాపోయాడు. దీంతో ఆయన సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.

Similar News

News March 13, 2025

భద్రాచలం: ఆన్‌లైన్‌లో టికెట్లు బుకింగ్

image

భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఏప్రిల్‌ 6, 7 తేదీల్లో జరిగే కళ్యాణం, మహా పట్టాభిషేకం ఉత్సవాలకు బుధవారం నుంచి ఆన్‌లైన్‌లో టికెట్లు అందుబాటులో ఉంటాయని ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. htts://bhadradritemple.telangana.gov.in వెబ్‌సైట్‌ ద్వారా భక్తులు టికెట్లు బుక్‌ చేసుకోవచ్చని చెప్పారు. ఈనెల 20వ తేదీ ఉదయం 11 నుంచి ఏప్రిల్‌ 6వ తేదీ ఉదయం 6 గంటల వరకు తానీషా కళ్యాణ మండపంలో టికెట్లు పొందాలని సూచించారు.

News March 13, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు’

image

∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల పర్యటన ∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న ఇంటర్ పరీక్షలు ∆} ఎర్రుపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} సత్తుపల్లిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} నేలకొండపల్లిలో ఎమ్మార్పీఎస్ నిరసన కార్యక్రమం

News March 13, 2025

ఖమ్మం: కేంద్రమంత్రికి మంత్రి తుమ్మల లేఖ

image

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్సంగ్ చౌహాన్‌కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం కింద పసుపు పంట కొనుగోలు చేయాలని లేఖ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మార్చిలో అధిక మొత్తంలో పసుపు పంట మార్కెట్‌కు వచ్చే అవకాశముందని, రైతులు నష్టపోకుండా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.

error: Content is protected !!