News February 5, 2026
ఖాకీలో కర్తవ్యం.. హృదయంలో సేవాభావం

★ చదివిన బడికి నెల జీతం విరాళం
ATP: అనంతపురం జిల్లా శెట్టూరు మండలం మాకొడికి గ్రామానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ షేక్ ఖాసీం సాబ్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. రాయదుర్గం పట్టణ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఆయన, తాను చదువుకున్న ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం ఒక నెల జీతం రూ.45 వేలను విరాళంగా అందజేశారు. సొంత ఊరిపై మమకారంతో ఆయన చేసిన ఈ సాయాన్ని గ్రామస్థులు, ఉపాధ్యాయులు అభినందించారు.
Similar News
News February 21, 2026
HYD: 5 ఓట్లు ఉంటే రూ.లక్ష..!

రంగారెడ్డి జిల్లాలోని 6 మున్సిపాలిటీల్లో అభ్యర్థులు ఓట్ల కోసం సుమారు రూ.300 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. బరిలో నిలిచిన వారు ఒకరిని మించి ఒకరు విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేసినట్లు సమాచారం. కొన్నిచోట్ల ఐదు ఓట్లు ఉన్న ఇంటికి లక్షల్లో డబ్బులు అందినట్లు తెలుస్తోంది. బలమైన అభ్యర్థులు ఉన్న వార్డుల్లో రూ.10 నుంచి 15 కోట్ల వరకు ఖర్చు పెట్టినట్లు చర్చ నడుస్తోంది.
News February 21, 2026
కర్రి పద్మశ్రీ ఎమ్మెల్సీ పదవిపై వీడని ఉత్కంఠ!

కాకినాడకు చెందిన ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ రాజీనామాపై శుక్రవారం శాసనమండలి ఛైర్మన్ వివరణ తీసుకున్నారు. 2024లో ఆమె YCP నుంచి TDP లో చేరిన సమయంలోనే రాజీనామా చేశారు. అయితే సాంకేతిక కారణాలతో ఆమోదం లభించలేదు. దీనిపై ఈనెల 24 మంగళవారం తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని ఛైర్మన్ వెల్లడించారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు కాకినాడ జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.
News February 21, 2026
నల్గొండ: హత్యాయత్నం.. తండ్రీకూతుళ్లకు రిమాండ్

భూ తగాదా నేపథ్యంలో వ్యక్తిపై హత్యాయత్నానికి పాల్పడిన తండ్రీకూతుళ్లకు NLG కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. NKP(M) అమ్మనబోలుకి చెందిన జెర్రిపోతుల రమేష్, బాసాని శివ మధ్య భూ వివాదం నడుస్తోంది. ఈ నెల 19న వివాదాస్పద స్థలంలో రమేష్ తన భార్య సమాధి నిర్మిస్తుండగా, శివ అడ్డుకున్నాడు. దీంతో ఆగ్రహించిన రమేశ్, అతని కుమార్తె నేహ కలిసి శివపై కత్తితో దాడి చేశారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.


