News July 3, 2024

ఖాజీపేట హై‌స్కూల్ ఇన్‌ఛార్జ్ హెచ్ఎం సస్పెండ్

image

ఖాజీపేటలోని బాలికల ఉన్నత పాఠశాలలో కలుషిత నీరు తాగి 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ విషయానికి సంబంధించి పాఠశాల ఇన్‌ఛార్జ్ ప్రధానోపాధ్యాయురాలు ఉమాదేవిని సస్పెండ్ చేసినట్లు డీఈవో అనురాధ తెలిపారు. దీంతోపాటు ఖాజీపేట ఎంఈఓ-1 నాగ స్వర్ణలత, ఎంఈఓ-2 నాగరాజుకు షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. నీటి ట్యాంకుల శుభ్రతలో ఇన్‌ఛార్జ్ హెచ్ఎం నిర్లక్ష్యం వల్లే నీరు కలుషితమైందన్నారు.

Similar News

News July 5, 2024

రేపు కడపకు రానున్న YS జగన్

image

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు కడప జిల్లా పర్యటనకు రానున్నారు. అనంతరం 8వ తేదీన తన తండ్రి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకొని ఇడుపులపాయలోని ఆయన సమాధి వద్ద నివాళులర్పించేందుకు ఆయన రేపు సాయంత్రం కడప రానున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి విమానం ద్వారా కడపకు చేరుకొని రోడ్డు మార్గాన ఇడుపులపాయ వెళ్తారని కడప మేయర్, జిల్లా వైసీపీ అధ్యక్షుడు సురేశ్ బాబు తెలిపారు.

News July 5, 2024

రాజంపేట సబ్ జైలు నుంచి ఖైదీ పరార్

image

రాజంపేట సబ్ జైలు నుంచి బాషా అనే ఖైదీ గురువారం పరార్ అయ్యారని పట్టణ సీఐ మద్దయ్య ఆచారి తెలిపారు. ఉదయం 8-9 గంటల సమయంలో వంట చేయడానికి ఖైదీలను జైలు గది నుంచి బయటకు వదిలిన సమయంలో దుప్పట్లను తాడుగా చేసుకుని గోడ దూకి పరారయ్యాడని జైలర్ మల్లారెడ్డి తమకు ఫిర్యాదు చేశారని తెలిపారు. హత్య కేసులో ముద్దాయి బాషా గత ఏడాది నవంబర్ నుంచి జైలులో ఉన్నారు. ఇతనిది రైల్వే కోడూరు అని తెలిపారు.

News July 5, 2024

కడప: గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

కడప ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో గెస్ట్ లెక్చరర్స్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ సూర్యరావు తెలిపారు. వాణిజ్యశాస్త్రం, భౌతికశాస్త్రం, ఆధునిక ఉర్దూ సబ్జెక్టులలో బోధించుటకు అర్హులైన అధ్యాపకులు కావాలన్నారు. మాస్టర్ డిగ్రీలో 50% మార్కులు కలిగిన వారు అర్హులని తెలిపారు. అర్హులైన వారు ఈ నెల 9వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. 12వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు.