News February 28, 2025
ఖానాపూర్: ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

ఖానాపూర్ మండలం బీర్నంది గ్రామంలోని రాజీవ్ తండాకు చెందిన బానావత్ వెంకటేశ్(27) గురువారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్ఐ రాహుల్ గైక్వాడ్ తెలిపారు. ఎస్ఐ వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లో కూలీ పని చేసుకుంటూ ఉండే వెంకటేశ్ శివరాత్రి పండుగ సందర్భంగా గత నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చాడు. భార్య మీనాక్షితో గొడవ కావడంతో వెంకటేశ్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Similar News
News March 1, 2025
విశాఖలో TODAY TOP NEWS

➤ KGHలో నకిలీ డాక్టర్.. రూ.లక్షతో పరార్..!
➤ ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపల్‌గా సంధ్యాదేవి
➤ సింహాద్రి, జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లు రద్దు
➤ బాధ్యతలు స్వీకరించనున్న AU వీసీ జి.పి రాజుశేఖర్
➤ ప్రత్యేక అలంకరణలో చంద్రంపాలెం దుర్గాలమ్మ
➤ ఆటోనగర్, ఐటీ హిల్స్ ప్రాంతాలకు ప్రత్యేక RTC సర్వీసులు నడపాలి: కలెక్టర్
➤ విశాఖలో చిట్టీల పేరుతో ఘరానా మోసం
➤ జిల్లాలో రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు రాయనున్న 83,001 మంది
News March 1, 2025
మిరాకిల్ జరిగితేనే..

వర్షం కారణంగా ఆస్ట్రేలియాతో మ్యాచ్ రద్దవ్వడంతో అఫ్గానిస్థాన్ సెమీస్ ఆశలు దాదాపు గల్లంతైనట్లే. పాయింట్ల పరంగా దక్షిణాఫ్రికా(3P)తో సమానంగా ఉండగా రేపటి మ్యాచులో ఇంగ్లండ్ చేతిలో SA భారీ తేడాతో ఓడితేనే అఫ్గాన్‌కు అవకాశాలు ఉంటాయి. సుమారు 200 పరుగుల తేడాతో ENG గెలవాల్సి ఉంది. ఒకవేళ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైనా SA నేరుగా సెమీస్ వెళ్లనుంది.
News February 28, 2025
రోహిత్, షమీ సహా అందరూ ఫిట్: కేఎల్

ఫిట్‌నెస్ సమస్యలతో మార్చి 2న కివీస్‌తో మ్యాచ్‌కు <<15595049>>రోహిత్,<<>> షమీ దూరమవుతారన్న వార్తలపై కేఎల్ రాహుల్ స్పందించారు. ‘నాకు తెలిసినంత వరకు ఆటగాళ్లంతా ఫిట్‌గా ఉన్నారు. ఎవరూ మ్యాచ్ మిస్సయ్యే ఛాన్స్ లేదు. అందరూ జిమ్, ప్రాక్టీస్ చేస్తున్నారు. పైగా సెమీస్‌కు ముందు ఒక మ్యాచే ఉన్నందున జట్టులో మార్పులు ఉండకపోవచ్చు’ అని తెలిపారు. కాగా ఇవాళ రోహిత్ గంట పాటు మైదానంలో చెమటోడ్చారు.