News August 29, 2025

ఖానాపూర్ నుంచి పాలజ్‌కు ప్రత్యేక బస్సు

image

ప్రయాణికుల సౌకర్యార్థం ఉదయం 5.30 గంటలకు ఖానాపూర్ నుంచి మహారాష్ట్రలోని పాలజ్(కర్ర గణపతి) దర్శనానికి మెట్పల్లి డిపో నుంచి సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటుచేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఖానాపూర్‌లో ఉదయం 5.30 గంటలకు బయలుదేరి మార్గమధ్యలోని మాటేగావ్‌లోని కోరాడి గణపతి ఆలయ దర్శనం, ఆ తర్వాత పాలజ్ వెళ్తుందన్నారు. రాత్రికి తిరుగు ప్రయాణం అవుతుందని తెలిపారు. ఛార్జీ రూ.620గా నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

Similar News

News August 29, 2025

తాళ్లపూడి: ఉరేసుకుని యువకుడి మృతి

image

తాళ్లపూడి మండలం తిరుగుడుమెట్టకి చెందిన సాయి (26) గ్రామ శివారులో వేపచెట్టుకు శుక్రవారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి 6సం.లు క్రితం వివాహం కాగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎడాది క్రితం భార్యమృతి చెందడంతో మానసికంగా కృంగి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తాళ్లపూడి ఎస్ఐ రామకృష్ణ తెలిపారు.

News August 29, 2025

రామగిరి: సమస్యల పరిష్కారానికి మంత్రి హామీ

image

రామగిరి మండలంలోని లద్నాపూర్ గ్రామ సమస్యల పరిష్కారం కోసం గ్రామస్థులు ఐటీ మంత్రి శ్రీధర్ బాబును కలిశారు. 283 మందికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని, ప్లాట్లు కేటాయించాలని కోరారు. దీనిపై మంత్రి స్పందిస్తూ, వారం రోజుల్లో సమస్యను పరిష్కరించాలని సింగరేణి సీ అండ్ ఎండీని ఫోన్‌లో ఆదేశించారు. అంతేకాక, ప్లాట్ల పనులు వెంటనే ప్రారంభించాలని మంథని ఆర్డీఓను ఆదేశించారు.

News August 29, 2025

మండపాల వద్ద ప్రమాదాలు జరగకుండా చర్యలు: ఎస్ఈ

image

వినాయక మండపాల వద్ద విద్యుత్ ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఏపీ ఈపీడీసీఎల్ విశాఖ సర్కిల్ ఎస్ఈ శ్యాంబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మండపాల నిర్వాహకులు లైసెన్స్ ఉన్న ఎలక్ట్రీషియన్లతోనే పనులు చేయించాలని సూచించారు. తగిన సామర్థ్యం ఉన్న ఫ్యూజ్ వాడాలని, ఓవర్ లోడ్ అవ్వకుండా చూసుకోవాలని అన్నారు. ఎంసీబీలు, ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్లు ఉపయోగించాలని అన్నారు. నాణ్యమైన వైర్లు వాడాలన్నారు.