News March 23, 2026
ఖాళీ స్టేడియాల్లో PSL

పాక్ సూపర్ లీగ్ పతనం దిశగా సాగుతోంది. మెజార్టీ విదేశీ ఆటగాళ్లు IPL వైపు మొగ్గుచూపుతుండగా, భద్రతా కారణాలతో పలువురు అక్కడికి వెళ్లట్లేదు. ఈ క్రమంలో ఈసారి ప్రేక్షకులు లేకుండా కేవలం 2 వేదికల్లోనే మ్యాచ్‌లను నిర్వహిస్తున్నట్లు PCB ఛైర్మన్ నఖ్వీ వెల్లడించారు. పొదుపు చర్యల్లో భాగంగానే ఇలా చేస్తున్నట్లు తెలిపారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ దేశంలో ఆర్థిక, ఇంధన సంక్షోభం తలెత్తిన విషయం తెలిసిందే.
Similar News
News April 3, 2026
IPL: అభిషేక్ శర్మకు ఫైన్

అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన SRH బ్యాటర్ అభిషేక్ శర్మకు మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా పడింది. కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించినందుకు ఒక డీమెరిట్ పాయింట్ విధించినట్లు IPL ఓ ప్రకటనలో తెలిపింది. KKRతో నిన్న జరిగిన మ్యాచులో <<19551503>>అభిషేక్ క్యాచును<<>> వరుణ్ చక్రవర్తి అందుకున్నారు. అయితే క్యాచ్ పట్టడానికి ముందు బాల్ నేలను తాకినట్లుగా కనిపించడం వివాదాస్పదమైంది.
News April 3, 2026
వార్ ఎఫెక్ట్.. భారీగా పెరగనున్న మెడిసిన్ రేట్లు

పశ్చిమాసియా యుద్ధం వల్ల ధరలు పెరిగే జాబితాలో మందులు కూడా చేరుతున్నాయి. ఔషధాల తయారీకి అవసరమయ్యే ముడిపదార్థాల సరఫరాలో తీవ్ర అంతరాయంతో వాటి ధరలు 200-300% పెరిగాయి. దీంతో మెడిసిన్ రేట్లు గరిష్ఠంగా 180% పెరుగుతాయని తెలుస్తోంది. ప్రజలకు త్వరలోనే ఈ బ్యాడ్‌న్యూస్ చెప్పేందుకు ఫార్మా కంపెనీలు సిద్ధమవుతున్నాయి. పారాసెటమాల్, పెయిన్ కిల్లర్స్, యాంటీ బయాటిక్స్, బీపీ టాబ్లెట్స్ ధరలకు రెక్కలు రానున్నాయి.
News April 3, 2026
25 ఏళ్ల వ్యక్తిని పెళ్లి చేసుకున్న 55 ఏళ్ల మహిళ

చైనాకు చెందిన బ్యూటీ ప్రొడక్ట్స్ వ్యాపారవేత్త, బిలియనీర్ యు వెన్‌హాంగ్(55) తన కంటే 30ఏళ్ల చిన్నవాడైన మోడల్‌ను పెళ్లి చేసుకోవడం SMలో వైరల్ అవుతోంది. తన కంపెనీలో పనిచేసిన లియు యుచెన్‌ను 6వ పెళ్లి చేసుకున్నారు. కట్నంగా అతనికి ₹60కోట్లకు పైగా విలువైన ఆస్తులు, కార్లు ఇచ్చారు. ఆమె 45ఏళ్ల వయసులోనూ 25ఏళ్ల యువకుడిని పెళ్లి చేసుకోగా ఆ రిలేషన్ బ్రేక్ అయింది. కాగా ఆమెకు ఇదివరకే ఇద్దరు కొడుకులున్నారు.


