News October 17, 2024

ఖిలా వరంగల్ సందర్శించిన ఫొటోను ట్వీట్ చేసిన సజ్జనార్

image

తెలంగాణ రాష్ట్ర రోడ్ & ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఎండి వీసీ సజ్జనార్ గతంలో వరంగల్‌లో ఎస్పీగా విధులు నిర్వర్తించారు. 16 ఏళ్ల క్రితం వరంగల్‌లో విధులు నిర్వహిస్తున్న క్రమంలో సజ్జనార్ తన సతీమణితో కలిసి ఖిలా వరంగల్ కోటను సందర్షించారు. కోటలో తన సతీమణితో దిగిన ఫొటోను ఈరోజు ‘X’లో పోస్ట్ చేసి ఆ మధుర స్మృతిని జ్ఞప్తికి తెచ్చుకున్నారు. ఎంతటి బిజీ లైఫ్ ఉన్నా.. ఫ్యామిలీతో గడిపిన క్షణాలు మధురమైనవన్నారు.

Similar News

News September 16, 2025

సిర్పూర్ కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్లో వందే భారత్ హాల్టింగ్

image

కాజీపేట జంక్షన్ మీదుగా ప్రయాణించే నాగ్పూర్-సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ ప్రెస్‌కు సిర్పూర్ కాగజ్‌నగర్ స్టేషన్లో హాల్టింగ్ కల్పించినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ సోమవారం తెలిపారు. ఈనెల 18 నుంచి సికింద్రాబాద్-నాగ్పూర్(20102), ఈనెల 19 నుంచి నాగ్పూర్-సికింద్రాబాద్(201010) ఎక్స్‌ప్రెస్ సిర్పూర్ కాగజ్‌నగర్ స్టేషన్లో అధికారికంగా హాల్టింగ్ అవుతుందని స్పష్టం చేశారు.

News September 16, 2025

అనేక మలుపులు తిరిగిన చౌటపల్లి సొసైటీ వ్యవహారం..!

image

చౌటపల్లి సొసైటీ వ్యవహారం అనేక మలుపులు తిరిగి చివరికి పాలకవర్గం రద్దయ్యింది. కార్యాలయానికి నూతన భవనం, గోదాం, చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించడంతో ఖర్చుకు మించిన లెక్కలు రాశారని ఆరోపణలు వచ్చాయి. ఆయా భవనాలను ప్రారంభించడానికి మంత్రి సీతక్క రావడంతో ఆమె ప్రోగ్రాం ఖర్చుని సైతం అధికంగా చూపారు. కేవలం అరటిపండ్లకే రూ.60 వేలు ఖర్చయినట్లు రాశారు. దీంతో ఆడిటింగ్ చేసి పాలకవర్గాన్ని రద్దు చేశారు.

News September 16, 2025

పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

image

వరంగల్ జిల్లా కేంద్రంలో సెప్టెంబర్ 22 నుంచి 28 వరకు సార్వత్రిక ఓపెన్ ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం కలెక్టర్ డా.సత్యశారద కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సంబధిత అధికారులు ఉన్నారు.