News August 12, 2024
ఖిల్లా, బౌద్ధారామం అభివృద్ధికి ప్రతిపాదనలు

అభివృద్ధిలో జిల్లాను రాష్ట్రంలోనే ముందంజలో నిలిపేలా కృషిచేస్తున్నట్లు తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఖమ్మం ఖిల్లాకు పూర్వవైభవం వచ్చేలా పనులు చేపడుతామని తెలిపారు. విద్యుద్దీపాలతో అలంకరించడంతో పాటు రోప్ వే, వ్యూ పాయింట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని చెప్పారు. అంతేకాక నేలకొండపల్లి మండలంలోని బౌద్ధారామం అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ క్షేత్రం సుందరీకరణకు కృషి జరుగుతోందని అన్నారు.
Similar News
News December 12, 2025
బోనకల్ సర్పంచ్‌గా భార్య, వార్డు సభ్యుడిగా భర్త విజయం

బోనకల్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి బాణోత్ జ్యోతి సర్పంచ్‌గా ఘన విజయం సాధించారు. ఆమె తన ప్రత్యర్థి భూక్య మంగమ్మపై 962 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు. ఈ విజయం కంటే ఆసక్తికరంగా, జ్యోతి భర్త బాణోత్ కొండ 4వ వార్డు సభ్యుడిగా గెలుపొందారు. ఈ అపూర్వ విజయంతో గ్రామంలో వారి అనుచరులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు.
News December 12, 2025
ఖమ్మం: నేటితో రెండో విడత ప్రచారం ముగింపు

రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు ప్రచార గడువు నేటి సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఆదివారం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, కామేపల్లి, ఖమ్మం రూరల్, కూసుమంచి, ముదిగొండ, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం వంటి 6 మండలాల్లో అభ్యర్థులు చివరి రోజు ఇంటింటి ప్రచారానికి పదును పెడుతున్నారు. ప్రచారం ముగిసిన తర్వాత ఓటర్లను ప్రసన్నం చేసుకునే వ్యూహాలకు అభ్యర్థులు సిద్ధమవుతున్నారు.
News December 12, 2025
KMM: తొలివిడతలో సత్తా చాటిన కాంగ్రెస్ అభ్యర్థులు

ఖమ్మం జిల్లాలో జరిగిన తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు సత్తా చాటారు. తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో (7 మండలాల్లో) కాంగ్రెస్ పార్టీ-136, బీఆర్ఎస్-34, సీపీఐ-6, సీపీఎం-10, టీడీపీ-2, ఇండిపెండెంట్-4 స్థానాల్లో విజయం సాధించారు. అధికంగా వైరా మండలంలో మొత్తం 22 గ్రామ పంచాయితీల్లో 20 స్థానాల్లో కాంగ్రెస్, సీపీఎం-1, బీఆర్ఎస్- 1 స్థానాల్లో నిలిచారు.


