News October 20, 2025
ఖేడ్‌లో 21న ఉమ్మడి జిల్లా రగ్బీ ఎంపికలు

ఉమ్మడి మెదక్ జిల్లా బాలబాలికల అండర్-19 రగ్బీ ఎంపికలు ఈనెల 21న నారాయణఖేడ్‌లోని తహశీల్దార్ మైదానంలో నిర్వహిస్తున్నట్లు సంగారెడ్డి జిల్లా ఇంటర్ అధికారి గోవిందారం తెలిపారు. ఇంటర్ చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులని చెప్పారు. ఆసక్తిగల వారు బోనాఫైడ్, పదవ తరగతి మెమో, జనన ధ్రువీకరణ పత్రంతో ఉదయం 9 గంటలకు హాజరుకావాలని సూచించారు.
Similar News
News October 20, 2025
హనుమకొండ: 11 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్

హనుమకొండ సుబేదారి ప్రాంతంలోని శ్రీనివాస కాలనీలో ఓ ఇంటిపై పోలీసులు దాడి చేసి పేకాడుతున్న 11 మంది పేకాట రాయుళ్లను అరెస్టు చేశారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులకు అందిన సమాచారం మేరకు ఈ దాడులు జరిగాయి. నిందితుల నుంచి రూ.1.23 లక్షల నగదు, 11 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితులను పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు.
News October 20, 2025
MBNR: పేదల తిరుపతిగా కురుమూర్తి 2/2

పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభమవుతాయి. తిరుమల వేంకటేశ్వర స్వామి ప్రతిరూపమే ఇక్కడి స్వామివారని భక్తుల నమ్మకం. పాలమూరు జిల్లా నుంచే కాకుండా తెలంగాణ, ఆంధ్రా, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. బ్రహ్మోత్సవాల్లో ఉద్దాల (పాదుకల) ఊరేగింపు ఉత్సవమే ప్రధాన ఘట్టం. వీపుపై పాదుకలతో కొట్టించుకుంటే పాపాలు పోతాయని భక్తుల నమ్మకం.
News October 20, 2025
MBNR: పేదల తిరుపతిగా కురుమూర్తి 1/2

మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట (M) కురుమూర్తిలో ఉన్న దేవాలయం ఉమ్మడి జిల్లాలోనే అతి పురాతనమైన దేవస్థానంగా పేరుగాంచింది. తిరుమల వేంకటేశ్వర దేవాలయానికి, కురుమూర్తి దేవాలయానికి పోలికలున్నాయి. కాంచనగుహగా పేరొందిన కురుమూర్తి కొండలలోని వెంకటేశ్వరస్వామిని వైకుంఠ ఏకాదశి రోజున భక్తులు దర్శించుకుంటారు. సా.శ.1268 కాలంలో ముక్కెర వంశ మూలపురుషుడు గోపాలరాయుడు నిర్మించాడు. Way2News ప్రత్యేక కథనం.