News October 20, 2025
ఖేడ్‌లో 21న ఉమ్మడి జిల్లా రగ్బీ ఎంపికలు

ఉమ్మడి మెదక్ జిల్లా బాలబాలికల అండర్-19 రగ్బీ ఎంపికలు ఈనెల 21న నారాయణఖేడ్‌లోని తహశీల్దార్ మైదానంలో నిర్వహిస్తున్నట్లు సంగారెడ్డి జిల్లా ఇంటర్ అధికారి గోవిందారం తెలిపారు. ఇంటర్ చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులని చెప్పారు. ఆసక్తిగల వారు బోనాఫైడ్, పదవ తరగతి మెమో, జనన ధ్రువీకరణ పత్రంతో ఉదయం 9 గంటలకు హాజరుకావాలని సూచించారు.
Similar News
News October 20, 2025
కందుకూరు మాజీ ఎమ్మెల్యేకు అవమానం!

గుడ్లూరు మండలం దారకానిపాడు హత్య ఘటనను పరామర్శించేందుకు వెళ్లిన కందుకూరు మాజీ ఎమ్మెల్యే దివి శివరాంకు ఘోర అవమానం జరిగింది. పాత్రికేయుల సమావేశం సమయంలో ఆయనకు కుర్చీ కూడా ఇవ్వలేదు. సీనియర్ నాయకుడు నిలబడే పరిస్థితి రావడం నేతల్లో తీవ్ర అసంతృప్తి కలిగించింది. ఈ ఘటనపై స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పార్టీ నాయకులు దివి శివరాం పట్ల తగిన గౌరవం చూపలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News October 20, 2025
NZB: CP సాయి చైతన్యపై ప్రశంసల వర్షం

CCS కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు రియాజ్‌ను పోలీసులు కాల్చడంతో పోలీసులపై, CP సాయి చైతన్యపై ప్రశంసల వర్షం కురుస్తోంది. పోలీసులపై ప్రశంసలు కురిపిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ‘హాట్సాఫ్ పోలీస్’ అంటూ పొగుడుతున్నారు. ‘శివ భక్తుడికి కోపం వస్తే.. అసలైన శివ తాండవమే’ అంటూ సీపీ సాయి చైతన్యను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
News October 20, 2025
దీపాలు వెలిగించేటపుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి

ఆనందకరమైన దీపావళి పండగను జరుపుకొనే సమయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ప్రమాదాలకు ఆస్కారం ఎక్కువ. దీపాలకు తగులుతాయి అనుకున్న కర్టెన్లను వీలైతే కొన్నిరోజుల పాటు తీసి పక్కన పెట్టేయండి. దుస్తులు దీపాలకు అంటకుండా చూసుకోవాలి. లూజుగా ఉండే కాటన్ దుస్తులను ధరించాలి. పిల్లలు బాణసంచా కాలుస్తుంటే పక్కనే పెద్దవాళ్లు ఉండాలి. టపాసులు కాల్చేటపుడు షూ, కళ్లజోడు ధరించాలి. కాకర్స్‌ను దీపాలకు దూరంగా పెట్టుకోవాలి.