News December 24, 2025

ఖేల్‌రత్నకు హార్దిక్, అర్జునకు దివ్య, తేజస్వీ.. కమిటీ సిఫార్సు

image

హాకీ మెన్స్ టీమ్ వైస్ కెప్టెన్ హార్దిక్ సింగ్‌ను మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్‌రత్న అవార్డుకు సెలక్షన్ కమిటీ సిఫార్సు చేసింది. అథ్లెట్లు తేజస్వీ శంకర్, ప్రియాంక, నరేందర్ (బాక్సింగ్), విదిత్ గుజ్‌రాతీ, దివ్యా దేశ్‌ముఖ్ (చెస్), ధనుష్ శ్రీకాంత్ (డెఫ్ షూటింగ్), ప్రణతీ నాయక్ (జిమ్నాస్టిక్స్), రాజ్‌కుమార్ పాల్ (హాకీ), సుర్జీత్ (కబడ్డీ), నిర్మలా భాటి (ఖో ఖో)తోపాటు పలువురిని అర్జున అవార్డులకు రికమెండ్ చేసింది.

Similar News

News December 25, 2025

మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇవాళ కూడా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.320 పెరిగి రూ.1,39,250కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.300 ఎగబాకి రూ.1,27,650 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.1,000 పెరిగి రూ.2,45,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News December 25, 2025

క్రెడిట్ వార్.. రాహుల్‌కు కేంద్ర మంత్రి థాంక్స్

image

బెంగళూరులోని ‘ఫాక్స్‌కాన్’లో 30K మంది కార్మికుల నియామకంపై INC, BJP మధ్య క్రెడిట్ వార్ మొదలైంది. జాబ్ క్రియేషన్‌కు KA ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిందని LoP రాహుల్ ట్వీట్ చేయగా కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. ‘మోదీ మేక్ ఇన్ ఇండియా విజయవంతమైందని గుర్తించినందుకు థాంక్స్’ అని రిప్లై ఇచ్చారు. ఇరువురూ ఇలాంటి SM పోస్టులపై కాకుండా దేశంలో మరిన్ని ఉద్యోగాల కల్పనకు కృషిచేయాలని నెటిజన్లు కోరుతున్నారు.

News December 25, 2025

IBPS RRB PO పోస్టుల ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

image

IBPS ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో 3,928 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షల ఆన్సర్ కీని విడుదల చేసింది. స్కోరు కార్డులను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు https://www.ibps.in/లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ప్రిలిమినరీ ఎగ్జామ్స్ నవంబర్ 22, 23 తేదీల్లో నిర్వహించిన విషయం తెలిసిందే.