News April 9, 2025
ఖైదీలకు స్కిల్ ట్రైనింగ్ సర్టిఫికెట్ల ప్రదానం

వృత్తిరీత్యా నైపుణ్యం కలిగిన వారికి మాత్రమే ఉపాధి అవకాశాలు ఎక్కువగా వస్తాయని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. చిత్తూరు జైలులో బుధవారం స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమానికి హాజరై వృత్తి నైపుణ్య శిక్షణ పొందాలని ఖైదీలకు సూచించారు. అనంతనం శిక్షణ పొందిన పలువురు ఖైదీలకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.
Similar News
News November 10, 2025
రేపు జిల్లాలో నాలుగు పరిశ్రమల స్థాపనకు CM ప్రారంభోత్సవం

జిల్లాలో నాలుగు నూతన పరిశ్రమల స్థాపనకు సీఎం చంద్రబాబు వర్చువల్ విధానంలో మంగళవారం ప్రారంభోత్సవం చేస్తారని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. చిత్తూరు, కుప్పం, పుంగనూరు, నగరి మండలాల పరిధిలో 116 ఎకరాలలో రూ.56.76 కోట్ల వ్యయంతో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమాలలో సంబంధిత ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారన్నారు.
News November 10, 2025
చిత్తూరు: సమస్యల పరిష్కారానికి వినతులు

పీజీఆర్ఎస్‌లో వచ్చే ఫిర్యాదుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి అధికారులు పరిష్కరించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. చిత్తూరు కలెక్టరేట్‌లో సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహించారు. పెద్దపంజాణి మండలానికి చెందిన లక్ష్మీదేవి వన్ బీ కోసం, బొమ్మసముద్రం చెందిన భువనేశ్వరి వితంతు పింఛన్ కోసం, పీసీ గుంటకు చెందిన గుర్రప్ప పట్టాదారు పాసు పుస్తకం కోసం వినతి పత్రాలు ఇచ్చారు. మొత్తం 301 ఫిర్యాదులు వచ్చాయి.
News November 10, 2025
MBBS ఫలితాల్లో కుప్పం PES టాప్

Dr.NTR హెల్త్ యూనివర్సిటీ విడుదల చేసిన MBBS ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో కుప్పం PES మెడికల్ కళాశాల అగ్రస్థానంలో నిలిచింది. 150 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 143 మంది ఉత్తీర్ణత సాధించారని, 95.33% ఫలితాలతో ఏపీలో ప్రైవేట్ మెడికల్ కళాశాలలో PES అగ్రస్థానంలో నిలిచినట్లు CEO జవహర్ దొరస్వామి, ప్రిన్సిపల్ డా. హెచ్ఆర్ కృష్ణారావు తెలిపారు. డిస్టెన్షన్ లో 9 మంది, ఫస్ట్ క్లాస్ లో 82 మంది పాసైనట్లు వారు తెలిపారు.


