News March 25, 2025
ఖైరతాబాద్: జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ మీట్

జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 7 నుంచి 10 వరకు స్పోర్ట్స్ మీట్ నిర్వహించనున్నట్లు అదనపు కమిషనర్ యాదగిరి రావు తెలిపారు. 150 మంది జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, జీహెచ్ఎంసీ ఉద్యోగులు, సిబ్బందికి వివిధ క్రీడా పోటీలు ఉంటాయన్నారు. విజేతలకు మొదటి బహుమతి రూ.10,000, రెండో బహుమతి రూ.6,000, మూడో బహుమతి రూ.3,000 అందజేస్తారని వెల్లడించారు. ఆసక్తి గలవారు పాల్గొనాలని కోరారు.
Similar News
News March 28, 2025
కళకళలాడుతోన్న చార్మినార్

అర్ధరాత్రి చార్మినార్ కళకళలాడుతోంది. రంజాన్ మాసంలో నేడు చివరి శుక్రవారం కావడంతో మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనల(అల్ విధా జుమ్మా) కోసం ఏర్పాట్లు చేశారు. పండుగకు మరో రెండ్రోజులే సమయం ఉండటంతో జనాలు షాపింగ్ కోసం క్యూకట్టారు. కమాన్ రోడ్, భాగ్యలక్ష్మీ టెంపుల్ రోడ్, లాడ్ బజార్, న్యూ లాడ్ బజార్, రాత్‌ఖానా గల్లీ, మోతీ గల్లీలు కిక్కిరిసిపోయాయి. వాహనాలు పార్కింగ్‌కు స్థలం దొరకని పరిస్థితి నెలకొంది.
News March 27, 2025
ఉప్పల్‌లో SRH, మహేశ్ బాబు FANS

ఉప్పల్ స్టేడియం వద్ద SRH, సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. వరంగల్, ఖమ్మం ప్రాంతాలకు చెందిన పలువురు యువత ఆరెంజ్ ఆర్మీ టీషర్ట్స్, మహేశ్ బాబు బ్యానర్‌తో స్టేడియానికి చేరుకున్నారు. ఈ సారి SRH బ్యాటింగ్‌కు దిగితే 300 స్కోర్ చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని నలుమూలల నుంచి క్రికెట్ ఫ్యాన్స్ రావడంతో స్టేడియం పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి.
News March 27, 2025
కాంగ్రెస్ మహిళా నాయకురాళ్లకు ఢిల్లీలో శిక్షణ

అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కలంబ ఆధ్వర్యంలో “నేతృత్వ సృజన్” పేరుతో మహిళా నాయకత్వ శిక్షణ తరగతులు న్యూఢిల్లీలో 2 రోజులపాటు జరిగాయి. ఖైరతాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో మహిళా కార్యకర్తలు ఢిల్లీకి వెళ్లి శిక్షణా తరగతుల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ఇంఛార్జి మీనాక్షి నటరాజన్, తదితరులు ఉన్నారు.