News April 4, 2025

ఖైరతాబాద్: టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన మేయర్

image

గ్రేటర్ పరిధిలో వర్షాల పట్ల జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి జోనల్ కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. లోతట్టు ప్రాంతాలు వర్ష ప్రభావిత ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉండాలని అన్నారు. వాటర్ లాగిన్ పాయింట్లను గుర్తించాలన్నారు. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతే జీహెచ్ఎంసీ నంబర్ 040-21111111కు ఫిర్యాదు చేయాలని సూచించారు.

Similar News

News April 4, 2025

HYD ప్రెస్‌క్లబ్ 2025 డైరీని ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం

image

హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ 2025 డైరీని తన క్యాంప్ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క శుక్రవారం ఆవిష్కరించారు. ప్రెస్‌క్లబ్‌కు స్థలం కేటాయించాలని ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రిని ప్రెస్‌క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు వేణుగోపాల్ నాయుడు, రవికాంత్ రెడ్డి కోరారు. దానికి ఆయన సానుకూలంగా స్పందించినట్టు పేర్కొన్నారు. అనంతరం ప్రెస్‌క్లబ్ పాలకమండలి సభ్యులు బట్టిని శాలువాతో సత్కరించారు.

News April 4, 2025

CS శాంతి కుమారికి రైతు కమిషన్ వినతి

image

ములుగు జిల్లాలో నకిలీ మొక్కజొన్న విత్తనాలతో గిరిజన రైతులకు జరిగిన నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని, రైతు హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం వెంటనే చట్ట సవరణలు చేయాలని రైతు కమిషన్.. CS శాంతి కుమారికి నివేదిక అందించింది. వ్యవసాయ మార్కెట్, విత్తన చట్టాల్లో మార్పులు, నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, వ్యవసాయ శాఖ పేరులోనూ మార్పులు కోరింది.

News April 4, 2025

IIT హైదరాబాద్‌కు విరాళమిస్తే నో టాక్స్

image

ప్రముఖ విద్యాసంస్థ ఐఐటీ హైదరాబాద్‌కు విరాళమిచ్చే వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ ప్రకటించింది. ఈ విద్యా సంస్థకు విరాళం ఇస్తే ఆ మొత్తానికి సంబంధించి టాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. గతంలో 50% పన్ను చెల్లించాల్సి ఉండేది. అయితే ఇపుడు ఐటీ యాక్ట్ సెక్షన్ 80జీ ప్రకారం విరాళాలు టాక్స్ ఫ్రీ అని ఐఐటీహెచ్ డైరెక్టర్ ప్రొ.బీఎస్ మూర్తి తెలిపారు.

error: Content is protected !!