News September 3, 2025
ఖైరతాబాద్: నిమజ్జనానికి రూట్ మ్యాప్ రెడీ: సీపీ ఆనంద్

గణేశ్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు ముందుగానే సిద్ధం చేశామని HYD సీపీ సీవీ.ఆనంద్ తెలిపారు. రూట్ మ్యాప్‌లో భాగంగా ఆయన HYD కలెక్టర్ హరిచందన, రాచకొండ సీపీ సుధీర్‌బాబు, హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో కలిసి బాలాపూర్ గణేశ్ మండపాన్ని ఈరోజు సందర్శించారు. ప్రత్యేక పూజల అనంతరం నిమజ్జన శోభాయాత్ర సాగే చాంద్రాయణగుట్ట, చార్మినార్, మొజాంజాహీ మార్కెట్, అబిడ్స్, ట్యాంక్ బండ్ రూట్‌లను పరిశీలించి పలు సూచనలు చేశారు.
Similar News
News September 3, 2025
HYD: మంచి నీళ్ల కోసం మహిళల నిరసన

మేడ్చల్ జిల్లా దూలపల్లిలోని 16, 17వ వార్డుల్లో తాగునీరు సరఫరా కావడం లేదని ఆ బస్తీ మహిళలు బుధవారం ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. ఇటీవల తమ పంచాయతీ మున్సిపాలిటీలో విలీనమైందని, అయితే గ్రామ పంచాయతీ హయాంలో వేసిన పైప్‌లైన్ కావడంతో వారానికి ఒకసారి చాలీచాలని బోరు నీటిని వదలడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News September 3, 2025
‘HYD యూత్ డిక్లరేషన్ అమలు ఎక్కడ..?’

HYD యూత్ డిక్లరేషన్ అమలు కావడం లేదని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల నేతలు తెలిపారు. యూత్ డిక్లరేషన్ ప్రకారంగా నిరుద్యోగ భృతి రూ.4,000, ప్రతి ఏడాది జూన్ 2న జాబ్ క్యాలెండర్ విడుదల చేసి సెప్టెంబర్ 17 నాటికి రిక్రూట్‌మెంట్ పూర్తి చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, సెప్టెంబర్ 17 దగ్గరికి వస్తున్నప్పటికీ జాబ్ క్యాలెండర్ రాలేదన్నారు. ఎప్పుడు అమలు చేస్తారో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలన్నారు.
News September 3, 2025
FLASH: HYD: గృహిణి ఆత్మహత్య.. కేసు నమోదు

HYD అమీన్‌పూర్‌లోని హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీలో ఈరోజు విషాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానికంగా నివాసం ఉండే గృహిణి పార్వతి(31) ఉరేసుకుని చనిపోయింది. మృతురాలికి విష్ణువర్ధన్(7), సాత్విక్(6) ఇద్దరు కుమారులు. భర్త వెంకట కోటేశ్వరరావు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.