News November 8, 2025

ఖైరతాబాద్: సాగర తీరంలో సీఎం సైకత చిత్రం

image

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా శనివారం హుస్సేన్‌సాగర్‌ తీరంలోని ఎన్టీఆర్‌ మార్గ్‌లో శాండ్‌ ఆర్ట్‌తో ఆయన చిత్రాన్ని రూపొందించారు. ఖైరతాబాద్‌ కార్పొరేటర్‌ పి.విజయారెడ్డి ఆధ్వర్యంలో సైకత శిల్పి ఆకునూరి బాలాజీ వరప్రసాద్‌ తీర్చిదిద్దారు. నెల్లూరు నుంచి తెప్పించిన 40 టన్నుల ఇసుకను ఉపయోగించి రేవంత్‌ చిత్రాన్ని 24 గంటలపాటు శ్రమించి రూపొందించారు. ఈ నెల 15వరకు ఈ ఆర్ట్‌ ఉంటుంది.

Similar News

News November 9, 2025

రాయదుర్గం PSలో మాగంటి గోపీనాథ్ తల్లి ఫిర్యాదు

image

దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతిపై అనుమానాలు ఉన్నాయని గోపీనాథ్ మృతి ఆయన తల్లి రాయదుర్గం PSలో ఫిర్యాదు చేశారు. మాగంటి మహనంద కుమారి కుమారుడు మరణంపై పోలీసులు దర్యాప్తు చెయ్యాలని సూచించారు. మృతికి సంబంధించి మొదటి నుంచి తల్లి మహానందకుమారి ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి తెలిసిందే.

News November 8, 2025

గ్యారెంటీలకు జూబ్లీహిల్స్‌లో BRS గెలవాలి: హరీశ్‌రావు

image

సునీతమ్మను అవహేళన చేసిన కాంగ్రెస్ నాయకులకు జూబ్లీహిల్స్ ప్రజలు బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. మాగంటి గోపీనాథ్ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి పేద ప్రజలకు, బస్తీ వాసులకు అండగా నిలిచారని అన్నారు. షేక్‌పేట్‌లోని అంబేడ్కర్ నగర్‌ కార్నర్ మీటింగ్‌లో పాల్గొన్న ఆయన కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు.

News November 8, 2025

HYD: ‘బస్తర్ హననంపై మీడియా మౌనం ఎందుకు’

image

దేశంలో దారుణమైన ఘటనలు జరిగినప్పుడు పలు కథనాలను ప్రచురించే మీడియా బస్తర్‌లో జరుగుతున్న హననంపై మౌనం ఎందుకు వహిస్తుందో గమనించాలని మాజీ సంపాదకులు కే.శ్రీనివాస్ ప్రజలకు సూచించారు. SVKలో పౌర హక్కుల సంఘం తెలంగాణ 3వ సభలో ఆయన మాట్లాడారు. దేశంలో అన్ని మీడియా సంస్థలను కంట్రోల్ చేసే వ్యవస్థ ఢిల్లీలో ఉందని, అందుకే మీడియా సంస్థలు మౌనం వహిస్తున్నాయని అన్నారు. రఘునాథ్, ప్రొ.హరగోపాల్, లక్ష్మణ్ పాల్గొన్నారు.