News March 20, 2024

ఖైరతాబాద్ RTO ఆఫీస్‌లో HERO అల్లు అర్జున్

image

HYD ఖైరతాబాద్ రవాణా కార్యాలయంలో ఈరోజు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందడి చేశారు. అంతర్జాతీయ లైసెన్స్ కోసం ఖైరతాబాద్ రవాణా కార్యాలయానికి అల్లు అర్జున్ వచ్చారు. లైసెన్స్ కోసం కావాల్సిన పత్రాలపై స్వయంగా సంతకాలు చేసి ఫొటోలు దిగారు. దీంతో అధికారులు, స్థానిక సిబ్బంది అల్లు అర్జున్‌తో ఫొటోలు, సెల్ఫీలు తీసుకున్నారు. అల్లు అర్జున్ రాకతో కార్యాలయం వద్ద సందడి నెలకొంది.

Similar News

News October 22, 2025

జూబ్లీహిల్స్: నేటి నుంచి నామినేషన్ల పరిశీలన..!

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రక్రియ కీలక ఘట్టానికి చేరుకుంది. మంగళవారంతో నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఇక నేటి నుంచి వాటి పరిశీలన కార్యక్రమం కొనసాగనుంది. వందలాది నామినేషన్లు రావడంతో పూర్తి పరిశీలనకు కాస్త సమయం పట్టే అవకాశముంది. ఇదిలా ఉండగా అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు ఈనెల 24 వరకు అవకాశం ఉంది.

News October 22, 2025

HYD: HMDAకు ఈ ఏడాది రూ.కోట్లల్లో ఆదాయం..!

image

HMDAకు ఈ సంవత్సరం రూ.1,225 కోట్లు ఆదాయం వచ్చింది. మల్టీ స్టోర్డ్ బిల్డింగ్‌లు, భవన నిర్మాణ అనుమతులు, లేఅవుట్ల పర్మిషన్లకు సంబంధించి ఈ సంవత్సరం 3,667 అప్లికేషన్లు వచ్చాయి. వీటిలో 79 శాతం అంటే 2,887 దరఖాస్తులకు పర్మిషన్ ఇచ్చింది. వీటి నుంచి రూ.1,225 కోట్ల ఆదాయం వచ్చింది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది ఇది 245 శాతం ఎక్కువ అని హెచ్ఎండీఏ పేర్కొంది.

News October 22, 2025

BREAKING: HYD: అమీర్‌పేట్ సదర్ ఉత్సవాల్లో అపశృతి

image

HYD అమీర్‌పేట్ మండలం మధురానగర్ పీఎస్ పరిధిలో నిర్వహించిన సదర్ ఉత్సవాల్లో ఈరోజు అపశృతి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఎల్లారెడ్డిగూడలో నిర్వహించిన సదర్ ఉత్సవాల్లో అదుపుతప్పిన దున్నరాజు జనాల్లోకి దూసుకెళ్లడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.