News September 2, 2025
గంగవరం: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన గంగవరం మండలంలో జరిగింది. బొమ్మనపల్లికి చెందిన బాలాజీ (41) స్కూల్ బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గ్రామ సమీపంలో ఉన్న ఆవుల షెడ్డులో పాలు పితకడానికి వెళ్లి ఎంతసేపటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూశారు. అక్కడ ఉరి వేసుకుని మృతి చెందినట్లు గుర్తించారు. అతని మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Similar News
News September 2, 2025
చిత్తూరు: దోమల నియంత్రణకు చర్యలు ఏవీ..!

వాతావరణ మార్పుతో పాటు దోమలు ఎక్కువైపోయాయి. అటు పంచాయతీలు..ఇటు పట్టణాలు రెండు వైపులా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జ్వరాలతో ప్రజలు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. దోమల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెబుతున్న అధికారులు ఫాగింగ్ చేసే పరిస్థితి కూడా లేదు. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు చిన్నపాటి క్లినిక్లు కూడా రోగులతో నిండిపోయాయి. ఆరోగ్య శాఖ ప్రకటనలు కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
News September 2, 2025
తిరుపతి ఎస్వీయూకి 71 ఏళ్లు

తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం స్థాపించి నేటితో 71 వసంతాలు పూర్తయింది. 1954 సెప్టెంబర్ 2న అప్పటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు చేతులమీదుగా వర్సిటీని ప్రారంభించారు. ఇక్కడ విద్యనభ్యసించిన ఎంతో మంది విద్యార్థులు నేడు అత్యున్నత స్థానాల్లో ఉన్నారు. కాగా ఇవాళ సాయంత్రం యూనివర్సిటీలోని శ్రీనివాస ఆడిటోరియంలో వర్సిటీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు.
News September 2, 2025
పుంగనూరు: పింఛను సొమ్ముతో పంచాయతీ సెక్రటరీ పరార్..!

పుంగనూరు (మం) బండ్లపల్లి సచివాలయ పంచాయతీ సెక్రటరీ శ్రీనివాసులు సోమవారం పంపిణీ చేయాల్సిన
రూ. 6.30 లక్షల పింఛను సొమ్ముతో పరారయ్యాడు. దీనిపై ఎంపీడీవో లీలా మాధవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై ఎస్ఐ కెవి రమణ కేసు నమోదు చేశామన్నారు. కార్యదర్శిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.