News February 11, 2025
గంగవరం: ఎస్సై కుటుంబానికి సాయం

రివాల్వర్‌తో కాల్చుకుని గంగవరానికి చెందిన తణుకు ఎస్ఐ మూర్తి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన కుటుంబానికి ఆయన స్నేహితులు రూ. 45.68 లక్షల సాయం చేశారు. 2012 బ్యాచ్‌కు చెందిన ఆదుర్తి గంగ సత్యనారాయణమూర్తి ఇటీవల తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఆయన స్నేహితులు కలిసి రూ. 45.68 లక్షల ఆర్థిక సహాయాన్ని మూర్తి భార్య విజయకు చెక్కు రూపంలో సోమవారం అందజేశారు.
Similar News
News November 3, 2025
టిప్పర్ డ్రైవర్ గుర్తింపు

TG: రంగారెడ్డి జిల్లాలో <<18184089>>బస్సు ప్రమాదానికి<<>> కారణమైన టిప్పర్ డ్రైవర్‌ను పోలీసులు గుర్తించారు. అతడు మహారాష్ట్రకు చెందిన ఆకాశ్ అని వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన లచ్చానాయక్ దగ్గర డ్రైవర్‌గా పని చేస్తున్నాడని తెలిపారు. హైదరాబాద్ శివారు పటాన్‌చెరులోని క్రషర్ మిల్లు నుంచి వికారాబాద్‌కు కంకర తీసుకెళ్తుండగా మీర్జాగూడ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆకాశ్ కూడా చనిపోయాడు.
News November 3, 2025
బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు: ASF ఎస్సీ

బాధితులకు సత్వరమే న్యాయం జరిగేలా చర్యలు తీసుకోనున్నట్లు ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణిలో భాగంగా అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదుదారుల సమస్యలను విని, వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు ఎస్పీ సూచించారు.
News November 3, 2025
US ఆంక్షల ఎఫెక్ట్.. చైనా మాస్టర్ ప్లాన్!

రష్యా ఆయిల్ కంపెనీలపై US ఆంక్షల నేపథ్యంలో చైనా తమ చమురు నిల్వలను భారీగా పెంచుకుంటోంది. 2025లో తొలి 9 నెలల్లో చైనా రోజుకు 11M బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకున్నట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ఇందులో 1-1.2M బ్యారెళ్లను నిల్వల కోసం దారి మళ్లించినట్లు వివరించింది. చమురు అవసరాల కోసం ఆ దేశం 70% విదేశాలపైనే ఆధారపడుతోంది. చైనా చమురు నిల్వల సామర్థ్యం 2 బిలియన్ బ్యారెళ్లకు పైగా ఉందని అంచనా.


