News December 13, 2025
గంగాధర: ఓటర్లకు డబ్బులు పంచిన వారిపై కేసు నమోదు

KNR(D) గంగాధర మండలం వెంకంపల్లి గ్రామంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద అభ్యర్థి సహా ముగ్గురిపై కేసు గంగాధర పీఎస్‌లో నమోదయింది. ఈ నెల 10న ఓటర్లకు డబ్బులు పంచుతున్న గుండవేని నర్సయ్యను ఎఫ్‌ఎస్‌టీ అధికారులు పట్టుకున్నారు. అతని నుంచి రూ.32,000 నగదును, ఎలక్ట్రిక్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. అభ్యర్థి గుండవేని లావణ్యతో పాటు ఆమె సోదరుడి ఆదేశాల మేరకు ఈ పని చేసినట్లు తేలడంతో ముగ్గురిపైనా కేసు నమోదు చేశారు.
Similar News
News December 17, 2025
ఓటరు ఐడీ లేకున్నా 18 కార్డులతో ఓటేయచ్చు: కలెక్టర్

ఓటరు ఐడీ లేకపోయినా, ఎన్నికల సంఘం అనుమతించిన 18 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి చూపించి ఓటు వేయవచ్చని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపారు. ప్రజలు భయపడకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు, ఉద్యోగ గుర్తింపు కార్డులు సహా 18 ఐడీలు చెల్లుబాటవుతాయని తెలిపారు. tsec.gov.inలో ఓటరు స్లిప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు.
News December 17, 2025
బుధ ప్రదోష పూజా విధానం

ప్రదోష పూజను సాయంత్రం చేయాలి. అప్పటి వరకు ఉపవాసం ఉండాలి. ప్రదోష వేళలో పూజా గదిలో శివలింగాన్ని లేదా శివపార్వతుల చిత్రపటాన్ని పూజించాలి. శివలింగానికి పవిత్ర జలంతో అభిషేకం చేయాలి. బిల్వ పత్రాలు, పూలు, పండ్లు సమర్పించడం తప్పనిసరి. ప్రశాంత మనస్సుతో ‘ఓం నమః శివాయ’ అని జపించాలి. శివ అష్టోత్తరం చదివి, హారతి ఇచ్చి, నైవేద్యం పంచి ఉపవాసం విరమించాలి. బుధ ప్రదోషం బుద్ధి, వ్యాపారంలో విజయాన్నిస్తుంది.
News December 17, 2025
MDK: గుండెపోటుతో సర్పంచ్ అభ్యర్థి మృతి

చిన్నశంకరంపేట మండలం జంగరాయి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి గుండెపోటుతో అస్పత్రిలో చేరిన సంజీవరెడ్డి మంగళవారం రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందారు. ఎన్నికలకు రెండు రోజుల ముందు అస్పత్రిలో చేరారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఓటమి చెందారు. పరిస్థితి విషమించి మంగళవారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.


