News December 22, 2025

గంగాధర: సర్పంచ్ మొదటి తీర్మానం.. రూపాయికే అంత్యక్రియలు!

image

బాధ్యతలు చేపట్టిన తొలిరోజే కరీంనగర్(D) గంగాధర(M) బూరుగుపల్లి గ్రామ సర్పంచ్ దూలం కళ్యాణ్ కుమార్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో ఎవరైనా మరణిస్తే కేవలం ఒక్క రూపాయికే దహన సంస్కారాలు నిర్వహించేలా తొలి పాలకవర్గ సమావేశంలో తీర్మానం చేశారు. ఈ వినూత్న పథకం బూరుగుపల్లి జిల్లాలోనే ప్రత్యేకంగా నిలిచింది. పరిమిత వనరులున్నా పేదలకు అండగా నిలవాలనే సర్పంచ్ సంకల్పంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.

Similar News

News December 24, 2025

ADB: 27న జిల్లాస్థాయి అథ్లెటిక్స్ క్రాస్ కంట్రీ ఎంపికలు

image

ఈ నెల 27న జిల్లాస్థాయి అథ్లెటిక్స్ క్రాస్ కంట్రీ ఎంపిక పోటీలు అండర్-16,18, 20 బాల బాలికలకు, మెన్ అండ్ ఉమెన్స్‌కి వేరువేరుగా ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు అథ్లెటిక్స్ అధ్యక్షుడు బోజా రెడ్డి తెలిపారు. ప్రతిభ గల క్రీడాకారులను ఎంపిక చేసి జనవరి 2న హైదరాబాద్‌లో జరిగే రాష్ట్ర పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. అర్హులైన, ఆసక్తిగల క్రీడాకారులు పాల్గొనాలని కోరారు.

News December 24, 2025

జిల్లాకు తలమానికం ‘జలజీవన్ మిషన్’: కలెక్టర్

image

జిల్లాలో ప్రతి ఇంటికీ తాగునీరు అందించడమే లక్ష్యంగా జలజీవన్ మిషన్ ప్రాజెక్టును అమలు చేస్తున్నట్లు కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో జలవనరుల శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం రూ.1,650 కోట్ల భారీ వ్యయంతో ఈ ప్రాజెక్టును మంజూరు చేసిందని, ఇది జిల్లా అభివృద్ధికి తలమానికమని పేర్కొన్నారు. పనులను నాణ్యతతో, నిర్దేశిత గడువులోగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.

News December 24, 2025

తిరుమలకు ఫేక్ టికెట్లతో వస్తున్నారా..?

image

తిరుమల వైకుంఠ ద్వారా దర్శనాల నేపథ్యంలో SP సుబ్బరాయుడు కీలక ప్రకటన చేశారు. ‘డిసెంబర్ 30, 31, జనవరి 1న లక్కీడిప్ టోకెన్లు ఉన్నవారినే దర్శనానికి అనుమతిస్తాం. అన్ని టోకెన్లను స్కాన్ చేసి అందులోని టైం ప్రకారమే పంపుతాం. నకిలీ టోకెన్లు సృష్టించిన వారిపై, అవి నకిలీ అని తెలిసి కూడా తిరుమలకు తెచ్చిన వారినైనా కేసులు పెడతాం. ఆటో, జీపు డ్రైవర్లు భక్తులను మిస్ గైడ్ చేస్తే చర్యలు ఉంటాయి’ అని SP హెచ్చరించారు.