News July 10, 2024
గంగాపూర్: అంబులెన్స్‌లో ప్రసవం..

హవేలి ఘనపూర్ మండలంలోని గంగాపూర్ గ్రామానికి చెందిన మన్నె మల్లేశం భార్య కల్పనకు పురిటి నొప్పులు రాగా అంబులెన్స్‌కు సమాచారం తెలిపారు. మెదక్ MCH ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో నొప్పులు ఎక్కువ కాగా EMT శ్రీహరి డెలివరీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. తల్లి, బిడ్డలు క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. వారిని మెదక్ ఆస్పత్రిలో అడ్మిట్ చేసినట్లు పేర్కొన్నారు. పైలెట్ శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News February 23, 2026
ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలి : కలెక్టర్

ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా 28 కేంద్రాల్లో 12,334 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ప్రశ్నాపత్రాల లీకేజీకి తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాల స్పష్టం చేశారు.
News February 22, 2026
MRO, RDO కార్యాలయాల్లో రేపు ప్రజావాణి: మెదక్ కలెక్టర్

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తాత్కాలికంగా వాయిదా పడిన ‘ప్రజావాణి’ కార్యక్రమం సోమవారం నుంచి పునఃప్రారంభం కానుంది. జిల్లాలోని అన్ని MRO, RDO కార్యాలయాల్లో యథావిధిగా అర్జీలు స్వీకరిస్తారని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. అయితే, కలెక్టరేట్‌లో మాత్రం ప్రస్తుతానికి హెల్ప్ డెస్క్ ద్వారానే దరఖాస్తులు తీసుకుంటామని, మార్చి 2 నుంచి అక్కడ పూర్తిస్థాయిలో ప్రజావాణి నిర్వహిస్తామని స్పష్టం చేశారు.