News March 7, 2025

గంజాయిని కలిసికట్టుగా అరికడదాం: ADB కలెక్టర్

image

గంజాయిని కలిసికట్టుగా అరికడదాం అని, గంజాయి పండించడం, వాడడం చట్టరీత్యా నేరమని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ గౌస్ ఆలం అన్నారు. ప్రతి కళాశాలలో ఆంటీ డ్రగ్ కమిటీల ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. గంజాయి నిర్మూలనకు వివిధ శాఖల అధికారులతో వారు సమీక్ష సమావేశం నిర్వహించారు. 18 ఏళ్లలోపు వారికి నిషేధిత డ్రగ్స్ మెడికల్ షాపుల్లో ప్రిస్క్రిప్షన్ లేకుండా అందించకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

Similar News

News March 7, 2025

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి: ADB కలెక్టర్

image

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌష్ ఆలం అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్‌లో రోడ్ సేఫ్టీ పై సమావేశం నిర్వహించారు. జిల్లాలోని రోడ్డు ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్స్ గుర్తించాలని, ఎక్కువగా ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో నివారణ చర్యలు చేపట్టాలన్నారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు కార్యక్రమాలు నిర్వహించాలని, అవసరమైతే సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

News March 7, 2025

ఆదిలాబాద్: విద్యుత్ వినియోగదారులకు సూచనలు

image

ఇటీవల కొంతమంది వ్యక్తులు మీటర్ తిరగకుండా చేస్తామని వినియోగదారుల వద్దకు వచ్చి డబ్బులు తీసుకొని మీటర్‌లోని కొన్ని వైర్లను కట్ చేసి ప్రజలను మోసం చేస్తున్నారని ఆదిలాబాద్ V&APTS సీఐ ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, ఇలా చేయడం విద్యుత్ శాఖ పరంగా, చట్ట రీత్యా నేరంగా పరిగణించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు అలాంటి వ్యక్తులను నమ్మి మోసపోవద్దని సూచించారు.

News March 7, 2025

నీట్ పరీక్షకు కేంద్రాలను గుర్తించండి: ADB కలెక్టర్

image

మే 4న జరిగే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్ ) పరీక్ష నిర్వహణ కోసం జిల్లాలో పరీక్షా కేంద్రాలను గుర్తించి రిపోర్ట్ సమర్పించాలని ADB కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. నీట్ యూజీ -2025 పరీక్ష నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ గౌస్ ఆలంతో కలసి పాల్గొన్నారు. నీట్ పరీక్ష నిర్వహణ కోసం పరీక్ష కేంద్రాల ఎంపికకు నిబంధనల ప్రకారం అందులో ఉండాల్సిన మౌలిక వసతులపై ఆరా తీశారు.

error: Content is protected !!