News July 5, 2025
గంజాయిని రూపుమాపేందుకు కృషి: సూర్యాపేట ఎస్పీ

గంజాయిని రూపుమాపేందుకు పోలీస్ శాఖ కృషి చేస్తోందని SRPT జిల్లా SP నరసింహ అన్నారు. శనివారం కోదాడ మండలం దొరకుంట శివారులో గంజాయిని విక్రయిస్తూ పోలీసులకు చిక్కిన నిందితులు అడప రాకేశ్, వనపర్తి సాయిలును మీడియా ముందు ప్రవేశపెట్టి మాట్లాడారు. వీరి వద్ద నుంచి రూ.2.8 లక్షల విలువైన 10 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. నిందితులను పట్టుకున్న సీఐ రజిత రెడ్డి, రూరల్ పోలీసులను SP అభినందించారు.
Similar News
News July 5, 2025
NZB: 9 మంది హెడ్ కానిస్టేబుళ్లకు ASIలుగా పదోన్నతి

బాసర జోన్-2లో పని చేస్తున్న 9 మంది హెడ్ కానిస్టేబుళ్లకు ASIలుగా పదోన్నతి లభించింది. వీరిని నిజామాబాద్ కమిషనరేట్‌కు అలాట్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రియాజుద్దీన్, జక్రయ్య, పరమేశ్వర్, వసంతరావు, అరుణ కుమారి, అనురాధ, రమనేశ్వరి, ముంతాజ్ బేగం, సతీశ్ కుమార్ ASIలుగా పదోన్నతి పొందారు.
News July 5, 2025
BREAKING: నల్గొండ జిల్లాలో తీవ్ర విషాదం

నల్గొండ(D) శాలిగౌరారం(M) వంగమర్తిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామ వాసి వాణి(23), తన 8 నెలల పాపతో కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. కొన్ని నెలలుగా వాణి మానసిక స్థితి బాగా లేదు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది బావిలో గాలించి ఆమె మృతదేహాన్ని బయటకు తీశారు. పాప మృతదేహం కోసం వెతికినా దొరకలేదు. చీకటి కావడంతో గాలింపు చర్యలను తాత్కాలికంగా నిలిపివేశారు.
News July 5, 2025
HYD: గేటెడ్ కమ్యూనిటీల్లో ఇబ్బందులు.. GHMC ఆదేశాలు

HYDలో గేటెడ్ కమ్యూనిటీల్లో పోస్టుమాన్‌లకు ప్రవేశం, లిఫ్ట్ అనుమతి, పార్కింగ్ లేకపోవడంతో డెలివరీలకు ఇబ్బందులు తప్పటం లేదు. పోస్ట్‌మాస్టర్ జనరల్ ఫిర్యాదుపై జీహెచ్ఎంసీ కమిషనర్ అధికారులు, RWAలు సహకరించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. లిఫ్ట్ వినియోగం, పార్కింగ్, లెటర్‌బాక్స్ ఏర్పాటు తప్పనిసరి అని పేర్కొంది. అంతేకాక.. నివాసితులు ప్రతినిధులను నియమించాలని సూచించింది.