News November 13, 2025
గంజాయి రవాణాపై ఉక్కపాదం మోపాలి: SP

జిల్లా పరిధిలో ఎక్కడా గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని SP ఉమామహేశ్వర్ గురువారం ఆదేశించారు. గంజాయి వంటి మత్తు పదార్థాల వలన యువత, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తుందన్నారు. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని గంజాయి, ఇతర మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాల గురించి కళాశాలలు, పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
Similar News
News November 13, 2025
మహావిష్ణువు పేరును ఎందుకు స్తుతించాలి?

జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం|
స్తువన్నా మసహస్రేణ పురుషస్సతతోత్థితః||
భారతంలో భీష్ముడు, ధర్మరాజుకు ఈ శ్లోకాన్ని చెప్పారు. ‘జగత్ప్రభువు, దేవదేవుడు, అనంతుడు, పురుషోత్తముడు అయిన విష్ణువును వేయి నామాలతో స్తుతించిన పురుషుడికి నిత్యం శుభాలు కలుగుతాయి’ అనేది దీనర్థం. నిరంతరం విష్ణు నామాన్ని స్మరిస్తూ, ఆయన సేవ చేసే వ్యక్తికి ఎప్పుడూ మంచే జరుగుతుందని ఈ శ్లోకం వివరిస్తుంది. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>
News November 13, 2025
తిరుపతి: 164 పోలింగ్ కేంద్రాలకు ప్రతిపాదనలు.!

EC ఆదేశాల మేరకు ప్రత్యేక ఇంటెన్సివ్ పునర్విమర్శ–2025లో భాగంగా 1,200 మందికి పైగా ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలను గుర్తించి 164 కొత్త పోలింగ్ కేంద్రాల ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు కలెక్టర్ డా.వెంకటేశ్వర్ తెలిపారు. కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 38 కేంద్రాల ప్రాంతాల మార్పు, 9 పేర్ల మార్పు,164 కొత్త కేంద్రాల ప్రతిపాదనలతో పోలింగ్ కేంద్రాల సంఖ్య పెరిగిందన్నారు.
News November 13, 2025
తణుకులో సందడి చేసిన సినీ నటి నిధి అగర్వాల్

తణుకు పట్టణానికి గురువారం ప్రముఖ సినీనటి నిధి అగర్వాల్ వచ్చారు. తణుకులోని పార్వతి సమేత కపర్దేశ్వర స్వామి వారి ఆలయాన్ని ఆమె సందర్శించుకున్నారు. కార్తీక మాసం పురస్కరించుకుని ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులను పొందారు. ఇటీవల ఆలయాన్ని పునర్నిర్మించడంతో తణుకు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు.


