News December 27, 2025

గంజాయి వినియోగంపై ఉక్కుపాదం: ఎస్పీ

image

జిల్లాలో మత్తు పదార్థాల నియంత్రణకు పటిష్ఠ చర్యలు చేపట్టామని ఎస్పీ తెలిపారు. గంజాయి వినియోగించే 71 ప్రాంతాలను గుర్తించామని, ‘ఈగల్ టీం’ సమర్థంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. ఒడిశా నుంచి సాగుతున్న అక్రమ రవాణాను అడ్డుకోవడంతో పాటు, జిల్లాలో గంజాయి ఉత్పత్తులను పూర్తిగా అరికట్టామన్నారు. యువత మత్తుకు దూరంగా ఉండాలని, నిఘా ముమ్మరం చేశామని ఆయన వివరించారు.

Similar News

News January 1, 2026

కరెంట్ ఛార్జీలపై ప్రభుత్వం కీలక నిర్ణయం!

image

AP: కరెంట్ ఛార్జీలపై ప్రజలకు ఊరట కలిగించే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. సుమారు ₹4,498 కోట్ల ట్రూఅప్ ఛార్జీల భారాన్ని జనంపై మోపకుండా తానే భరించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు APERCకి అధికారులు లేఖ రాశారు. గత సెప్టెంబర్‌లోనూ ₹923 కోట్లను ప్రభుత్వం ట్రూడౌన్ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు గత నవంబర్ నుంచి <<17870164>>ట్రూడౌన్‌లో<<>> భాగంగా వినియోగదారులు ఉపయోగించే ఒక్కో యూనిట్‌పై 13 పైసలు తగ్గింపు ఇస్తున్నారు.

News January 1, 2026

విజయ్-రష్మిక రోమ్ టూర్.. కొనసాగుతున్న సస్పెన్స్

image

టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న రిలేషన్‌పై మరోసారి చర్చ జరుగుతోంది. న్యూఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఇద్దరూ రోమ్‌కి వెళ్లారు. అయితే ఒకే లొకేషన్‌లో సింగిల్ ఫొటోలు మాత్రమే షేర్ చేశారు. ఫ్రెండ్స్‌తో కలిసి వెకేషన్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. గతంలో నిశ్చితార్థం జరిగిందన్న వార్తలు, 2026 <<18708719>>ఫిబ్రవరిలో పెళ్లి<<>> అంటూ ప్రచారం ఊపందుకుంది. ఇప్పటివరకు వారి నుంచి అధికారిక ప్రకటన లేదు.

News January 1, 2026

తాటిపూడి జలాశయంలో నేటి నుంచి బోటింగ్ సెషన్ స్టార్ట్

image

తాటిపూడి రిజర్వాయర్‌ విజయనగరం జిల్లాలో ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. ఇక్కడ బోటింగ్ చేస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఇక్కడ రెండో దశ బోటింగ్ సేవలను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ డిసెంబర్ 27న ప్రారంభించారు. కొత్తగా 10 బోట్లను ప్రవేశపెట్టారు. వాటిలో 19 సీట్ల వాటర్ టాక్సీలు, 6 సీటర్ స్పీడ్ బోట్స్ ఉన్నాయి. నేటి నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.