News January 14, 2026

గంజితో ఎన్నో లాభాలు

image

అన్నం వండిన తర్వాత వచ్చే గంజి తాగడం వల్ల ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చర్మానికి కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. గంజిలో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మ సౌందర్యాన్ని పెంచడంలో సాయపడతాయంటున్నారు నిపుణులు. గంజిని ఒక మెత్తని వస్త్రం లేదా దూదితో ముఖానికి అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసిన పదినిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకుంటే చర్మం నిగనిగలాడుతుంది.

Similar News

News March 30, 2026

బాహ్యరూపాన్ని బట్టి అంచనా వేయొద్దు!

image

ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు
చూడచూడ రుచుల జాడ వేరు
పురుషులందు పుణ్య పురుషులు వేరయా
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: ఉప్పు, కర్పూరం చూడటానికి ఒకే విధంగా ఉంటాయి. కానీ వాటి రుచులు, గుణాలు వేర్వేరుగా ఉంటాయి. అలాగే మనుషులందరూ పైకి ఒకేలా కనిపించినప్పటికీ ప్రవర్తన, జ్ఞానం, మంచి గుణాల వల్ల గొప్ప వారు ప్రత్యేకంగా ఉంటారు. బాహ్యరూపం చూసి ఎవరినీ అంచనా వేయకూడదని అర్థం.
#PADHYAM

News March 30, 2026

కరెంట్ అఫైర్స్

image

* తొలి రంజీ ట్రోఫీ టైటిల్ గెలుచుకున్న జమ్మూ కశ్మీర్
* మోస్ట్ పవర్‌ఫుల్ ఇండియన్స్ జాబితాలో తొలి స్థానంలో ప్రధాని మోదీ
* వర్క్ ఇండియా రిపోర్ట్: కార్మికుల జీతాల్లోనే అధిక పెరుగుదల
* TG అసెంబ్లీలో తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు ఆమోదం
* TG ప్రభుత్వ ఉద్యోగులకు ఈవీలపై 10-20% రాయితీ
* హార్ముజ్‌లో భారతీయ నేవీ ఆధ్వర్యంలో ఆపరేషన్ ఊర్జా సురక్ష

News March 30, 2026

నేడు 2.50లక్షల మందికి ఇళ్ల పంపిణీ

image

AP: రాష్ట్ర ప్రభుత్వం నేడు రెండో విడత ఇళ్ల పంపిణీ చేపట్టనుంది. రాష్ట్రవ్యాప్తంగా లక్ష టిడ్కో ఇళ్లతో పాటు మరో 1.50లక్షల గృహాలను లబ్ధిదారులకు అందించనుంది. తిరుపతి జిల్లా పుదూరులో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొని గృహప్రవేశాలు చేయించనున్నారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన మొత్తం ఇళ్ల సంఖ్య 5.50లక్షలకు చేరనుందని ప్రభుత్వం తెలిపింది. 2025 నవంబరు 12న తొలి విడత కింద 3లక్షల ఇళ్లను అందించింది.