News May 16, 2024
గంటలో సమస్య పరిష్కరించిన విజయవాడ పోలీసు కమిషనరేట్

ఓ ప్రయాణికుడు ఆటో ఎక్కి విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి గుడి వద్ద దిగి తనతో పాటు తెచ్చుకున్న బ్యాగ్‌ను ఆటోలో మరిచిపోయాడు. కాసేపటికి తేరుకున్న ప్రయాణికుడు విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వారిని సంప్రదించగా.. విజయవాడ కమాండ్ అండ్ కంట్రోల్ నందు సీసీ కెమెరాల ద్వారా ఆటో నంబర్ గుర్తించి, ఆటో డ్రైవర్‌ను పిలిపించి, వెంటనే బ్యాగుని బాధితుడికి అప్పగించారు.
Similar News
News April 22, 2025
కృష్ణా: ‘ఈ- కేవైసీ చేయకపోతే రేషన్ అందదు’

రేషన్ కార్డు లబ్ధిదారులు ఏప్రిల్ 30లోపు కేవైసీ పూర్తిచేయాలని జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ సూచించారు. ఈ మేరకు ఆమె ఓ ప్రకటనను విడుదల చేశారు. జిల్లాలో 71,110 మంది ఇంకా చేయాల్సి ఉందని చెప్పారు. 5 ఏళ్లు లోపు, 80 ఏళ్లు పైబడినవారికి మినహాయింపు ఉందన్నారు. సంబంధిత వివరాలు డీలర్లు, తహసీల్దార్ల వద్ద ఉన్నాయని, గడువు మించినవారికి పథకాల లబ్ధి ఉండదని హెచ్చరించారు.
News April 22, 2025
ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య

పెనమలూరు మండలం పెద్దపులిపాకలో ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన కొక్కిలిగడ్డ రాజేష్ (29) విజయవాడ ఆటోనగర్లో వెల్డింగ్ పని చేసేవాడు. కొంతకాలం నుంచి మతిస్థిమితం సరిగ్గా లేకపోవడంతో చికిత్స తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో పెదపులిపాకలోని తన ఇంట్లో సోమవారం సాయంత్రం రాజేశ్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
News April 22, 2025
కృష్ణా : పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు పటిష్ఠ ఏర్పాట్లు – DRO

కృష్ణా జిల్లాలో ఈ నెల 30వ తేదీన జరగనున్న పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షల నిర్వహణకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి కె చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై సోమవారం తన ఛాంబర్‌లో అధికారులతో ఆయన సమీక్షించారు.10 పరీక్షా కేంద్రాల్లో 4546 మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు.