News January 26, 2026

గంటల వ్యవధిలో స్వల్పంగా తగ్గిన గోల్డ్ రేటు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం <<18961013>>ధర<<>> ఉదయంతో పోల్చితే కాస్త తగ్గింది. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఉదయం రూ.1,62,710 ఉండగా రూ.760 తగ్గి రూ.1,61,950కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర ఉదయం నుంచి రూ.700 పతనమై రూ.1,48,450 పలుకుతోంది. అటు KG సిల్వర్ రేటు రూ.3,75,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.

Similar News

News February 16, 2026

మంత్రులతో సీఎం రేవంత్ జూమ్ మీటింగ్

image

TG: కార్పొరేషన్ మేయర్లు, మున్సిపాలిటీల ఛైర్మన్ల ఎన్నికపై సీఎం రేవంత్ మంత్రులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. రేపు వీరి ఎన్నిక సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. హంగ్ ఏర్పడిన చోట ఏ ఒక్కటి చేజారనీయొద్దని నేతలకు దిశానిర్దేశం చేశారు. మీటింగ్‌లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి తదితరులు పాల్గొన్నారు.

News February 15, 2026

పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్

image

T20WC: ICC ఈవెంట్లలో పాక్‌పై భారత్ జైత్రయాత్రను కొనసాగించింది. ఫార్మాట్ ఏదైనా, ప్లేస్ మారినా ఫలితం మారదని నిరూపించింది. కొలంబోలో జరిగిన మ్యాచ్‌లో దాయాదిని 61 పరుగుల తేడాతో చిత్తు చేసింది. 176 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన పాక్‌ను 18 ఓవర్లలో 114 రన్స్‌కే కట్టడి చేసింది. బుమ్రా, అక్షర్, వరుణ్, హార్దిక్ తలో 2 వికెట్లు, కుల్దీప్, తిలక్ చెరో వికెట్ తీశారు. వరుసగా 3 విజయాలతో IND సూపర్-8కి చేరుకుంది.

News February 15, 2026

38 దేశాలతో ట్రేడ్ డీల్స్.. MSMEల మార్కెట్ విస్తరించింది: మోదీ

image

దేశంలో రాజకీయ స్థిరత్వం పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పెంచిందని PM మోదీ చెప్పారు. కొన్నేళ్లుగా 38 దేశాలతో 9 ట్రేడ్ డీల్స్ చేసుకున్నట్లు తెలిపారు. టెక్స్‌టైల్స్, లెదర్, కెమికల్స్, హ్యాండ్‌క్రాఫ్ట్స్, జువెల్లరీ వంటి రంగాల్లో MSMEల మార్కెట్ విస్తరించిందన్నారు. ఎగుమతిదారులకు కొత్త అవకాశాలు తెరుచుకున్నాయని పేర్కొన్నారు. UPA హయాంలో ఆర్థిక నిర్వహణ సరిగ్గా లేక ఏ దేశంతోనూ చర్చించలేకపోయిందని విమర్శించారు.