News January 11, 2026

గండికోట ఉత్సవాల్లో పర్యాటక మంత్రి.. ఏం మాట్లాడారంటే.!

image

పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ ఆదివారం గండికోట ఉత్సవాల్లో పాల్గొన్నారు. గండికోట ఓ వారసత్వ సంపదని మోదీ, CM, DyCm ఇలాంటి కట్టడాల పరిరక్షణకు పెద్దపీట వేశారన్నారు. గండికోట అభివృద్ధికి రూ.78 కోట్ల నిధులు మంజూరయ్యాయని, త్వరలో ఈ ప్రాంతంలో హోటల్స్ వెలుస్తాయన్నారు. ఈ ప్రాంత వసతి, సదుపాయాల కల్పనకు కృషి చేస్తామన్నారు. గండికోట ఉత్సవ ఏర్పాట్లు చేసిన కలెక్టర్, SP ఇతర జిల్లా యంత్రాంగాన్ని మంత్రి అభినందించారు.

Similar News

News February 3, 2026

కడప జిల్లాలో 15 మంది ఎస్సైల బదిలీ

image

కడప జిల్లాలో 15 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనా సౌలభ్యం కోసం ఈ బదిలీలు చేపట్టినట్లు తెలిపారు. ఇందులో బద్వేల్, వేంపల్లి, పోరుమామిళ్ల, పులివెందుల, ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు, సిద్దవటం తదితర స్టేషన్ల ఎస్సైలు ఉన్నారు. బదిలీ అయిన వారు వెంటనే కొత్త స్థానాల్లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.

News February 3, 2026

కడప: జనవరి నెలలో ఎంత కరెంట్ కాల్చారంటే.!

image

కడప సర్కిల్ పరిధిలో జనవరి నెలలో 361.886 మిలియన్ యూనిట్లు (MU) విద్యుత్ వినియోగం జరిగింది. కడప డివిజన్లో 51.999, పులివెందుల డివిజన్లో 63.585, ప్రొద్దుటూరు డివిజన్లో 94.843, మైదుకూరు డివిజన్లో 61.638, రాజంపేట డివిజన్లో 50.168, రాయచోటి డివిజన్లో 39.653 MU విద్యుత్ వినియోగం జరిగింది. కడప సర్కిల్ జనవరి నెల విద్యుత్ కోటా 323.862 MU కాగా.. 361.886 MU వినియోగం జరిగింది.

News February 3, 2026

కడప జిల్లాలో యూరియా దొరక్క అన్నదాతల అగచాట్లు: YCP

image

కడప జిల్లాలో రైతులకు యూరియా దొరక్క అగచాట్లు పడుతున్నారని YCP ఆరోపించింది. కాశినాయన మండలం ఓబులాపురంలోని రైతు సేవా కేంద్రం వద్ద ఉదయం నుంచి రైతులు యూరియా కోసం నిరీక్షణ చెందుతున్నారని ట్వీట్ చేసింది. స్టాక్ తక్కువగా ఉండటంతో యూరియా కోసం రైతులు తోపులాట చేసుకోవడంతో పలువురు రైతులు అస్వస్థత చెందారని పేర్కొంది. ఇంకెన్ని రోజులు రైతులకు ఈ యూరియా కష్టాలు అంటూ సీఎం చంద్రబాబును ప్రశ్నించింది.