News August 12, 2024

గండికోట జలాశయానికి రాకపోకలు బంద్

image

గండికోట జలాశయానికి భారీగా కృష్ణా జలాలు చేరుతున్న నేపథ్యంలో సందర్శకులు ప్రాజెక్టు లోపలికి రాకుండా బారికేడ్లను ఆదివారం మూసివేశారు. అవుకు జలాశయం నుంచి 11,300 క్యూసెక్కుల నీటిని GNSS ప్రధాన కాలువ ద్వారా గండికోటకు విడుదల చేశారు. నీటిని చూసేందుకు ఆసక్తితో చిన్నా, పెద్దా అని లేకుండా వస్తున్నారు. కాగా నీటి ప్రవాహం కొనసాగుతున్నందున ప్రమాదమని టన్నెల్ సమీపం వద్దకు ఎవరినీ అనుమతించడంలేదు.

Similar News

News January 17, 2025

మైదుకూరుకు సీఎం.. షెడ్యూల్ ఖరారు!

image

మైదుకూరులో రేపు CM చంద్రబాబు పర్యటిస్తున్న విషయం తెలిసిందే. రేపు మధ్యాహ్నం 12 గం. నుంచి హెలికాఫ్టర్ ద్వారా మైదుకూరు చేరుకుని, అనంతరం 12:20 నుంచి 1 గం. వరకు NTR వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. 1:55 నుంచి మైదుకూరు మున్సిపల్ ఆఫీస్‌ నుంచి ఇళ్లను సందర్శిస్తారు. 2:15 నుంచి చెత్త సేకరణపై అవగాహన కల్పిస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు.

News January 17, 2025

పులివెందులలో MLC సతీమణి ధర్నా

image

పులివెందుల పట్టణంలోని అహోబిలాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రేషన్ డీలర్లకు సంబంధించి రాత పరీక్ష జరుగుతోంది. వేంపల్లికి చెందిన ప్రకాశ్ అనే వ్యక్తిని కొంతమంది కిడ్నాప్ చేయడంతో ఆ వ్యక్తి రాత పరీక్షకు హాజరు కాలేదు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి సతీమణి ఉమాదేవి ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న దుండగులు ప్రకాశ్‌ను పులివెందులలోని పరీక్షా కేంద్రం వద్ద విడిచిపెట్టారు. 

News January 17, 2025

కడప అభివృద్ధికి నిధులు ఇవ్వండి: శ్రీనివాస రెడ్డి

image

కడప నగర అభివృద్ధికి ప్రభుత్వం స్పందించి నిధులను మంజూరు చేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన నిన్న రాత్రి అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. కడప నగరంతో పాటు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న పలు అభివృద్ధి పనుల విషయమై చర్చించారు. ఎన్నికల సమయంలో జిల్లాకు ఇచ్చిన హామీల అమలకు కృషి చేయాలన్నారు.