News December 5, 2024
గండికోట పర్యాటక అభివృద్ధికి అడుగులు: కలెక్టర్

ప్రపంచ పర్యాటక మ్యాపులు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న గండికోట పర్యాటక ప్రాంత అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గండికోట పర్యాటక అభివృద్ధిపై బుధవారం సమీక్షించారు. జిల్లాలో అత్యంత ప్రాచీన చారిత్రక ప్రాచుర్యం పొందిన పర్యాటక ప్రాంతమైన “గండికోట పర్యాటక కేంద్రం” భవిష్యత్తులో ప్రపంచ పర్యాటక రంగాన్ని శాసిస్తుందన్నారు.
Similar News
News February 22, 2026
కాశినాయన మండలంలో దారుణం

కాశినాయన మండలం గంగనపల్లెకు చెందిన దిలీప్ (24) అనే వ్యక్తిపై దుండగులు పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. గాయపడిన యువకుడిని స్థానికులు పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని విచారిస్తున్నారు.
News February 22, 2026
తిరుపతి: B.Ed విద్యార్థిని సూసైడ్

తిరుపతి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రైల్వే కోడూరులోని రంగనాయకులపేటలో B.Ed చదువుతున్న ఆమంచి భార్గవి (24) ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తల్లి పద్మ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్లు SI లక్ష్మీ ప్రసాద్‌రెడ్డి తెలిపారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
News February 22, 2026
ఎర్రగుంట్ల: రాత్రి రైలు ఎక్కి.. ఉదయానికి మిస్సింగ్

మచిలీపట్నం నుంచి ధర్మవరం వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలులో శనివారం ఉదయం ముక్కా ధనలక్ష్మి (25) అదృశ్యమైంది. ఈ మహిళ నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం గురువిమానిపల్లెకి చెందిన జగదీశ్వర్‌రెడ్డి భార్య. ఇరువురు విజయవాడలో శుక్రవారం రాత్రి రిజర్వేషన్ బోగీలో ఎక్కారు. తెల్లవారేసరికి తన భార్యలేదని భర్త ఎర్రగుంట్ల రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.


