News December 18, 2025
గండిపేట నీరు సురక్షితం.. వదంతులు నమ్మొద్దు: జలమండలి క్లారిటీ!

గండిపేటలో మురుగునీరు కలిసినట్లు వస్తున్న వార్తలను జలమండలి MD అశోక్ రెడ్డి ఖండించారు. వ్యర్థాలను పారబోసేందుకు యత్నించిన ప్రైవేట్ ట్యాంకర్‌ను ముందే గుర్తించి అడ్డుకున్నారని, రిజర్వాయర్ కలుషితం కాలేదని స్పష్టం చేశారు. నిందితులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, IS ప్రమాణాలతో ‘మూడంచెల క్లోరినేషన్’ పద్ధతిలో నీటిని శుద్ధి చేస్తున్నట్లు వివరించారు.
Similar News
News December 20, 2025
ఇందూరు: పెరిగిన ఉష్ణోగ్రతలు.. తగ్గని చలి

నిజామాబాద్ జిల్లాలో 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలను అధికారులు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా కనిష్ఠంగా 16.1 డిగ్రీల సెల్సియస్, గరిష్ఠంగా 30.7 డిగ్రీలు సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యాయి. చలివాతావరణం కొనసాగుతుండటంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఉదయం, రాత్రి వేళల్లో చలి ప్రభావం ఉంది. వృద్ధులు, చిన్నపిల్లలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
News December 20, 2025
ఈ నెల 21న పల్స్ పోలియో: కలెక్టర్

జాతీయ స్థాయి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఈ నెల 21వ తేదీన జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు పలు సూచనలు చేశారు. పల్స్ పోలియో కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. ఈ నెల 21వ తేదీన అన్ని కేంద్రాల్లో పల్స్ పోలియో చుక్కల మందు వేయనున్నట్లు పేర్కొన్నారు.
News December 20, 2025
రైలు ఢీకొని 8 ఏనుగులు మృతి.. పట్టాలు తప్పిన 5 బోగీలు

అస్సాంలోని హోజాయ్ జిల్లాలో సైరంగ్ నుంచి ఢిల్లీ బయల్దేరిన రాజధాని ఎక్స్‌ప్రెస్ ఏనుగుల గుంపును ఢీకొంది. ఈ ఘటనలో 8 ఏనుగులు మృతిచెందినట్లు ఫారెస్ట్ ఆఫీసర్లు వెల్లడించారు. రైలు ఇంజిన్‌తో సహా 5 బోగీలు పట్టాలు తప్పాయని, ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని రైల్వే అధికారులు తెలిపారు.


