News February 19, 2025

గండిపేట CBIT వద్ద రోడ్డు ప్రమాదం

image

HYD గండిపేట CBIT వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పిల్లర్‌ను కారు ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు భావిస్తున్నారు. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో ప్రాణాపాయం తప్పింది. శంకర్‌పల్లి నుంచి నార్సింగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.

Similar News

News February 21, 2025

HYD: ‘కాంగ్రెస్ రూ.1000 కోట్ల బడ్జెట్ కేటాయించాలి’

image

సంక్షేమ పథకాలు రజక వృత్తిదారులకు అందేలా బడ్జెట్ కేటాయించాలని రాష్ట్ర అధ్యక్షుడు గోపి రజక, ABDMS ప్రధాన కార్యదర్శి ఇటిక్యాల బండలయ్య అన్నారు. బ్యాంకులు షరతులు లేని రుణాలు ఇవ్వాలని కోరారు. గత ప్రభుత్వాలు తమను కేవలం ఓటు బ్యాంకుగానే చూశాయని HYDలో నేతల సమావేశంలో మాట్లాడారు. రజక సంక్షేమం కోసం కాంగ్రెస్ రూ.1,000 కోట్ల బడ్జెట్ కేటాయించాలని, పనిముట్ల కోసం ప్రతి కుటుంబానికి రూ.2 లక్షలివ్వాలని కోరారు.

News February 21, 2025

KPHBలో యువకుడి మిస్సింగ్

image

ఇ‌న్‌స్టాలో పరిచయమైన మహిళతో యువకుడు వెళ్లి పోయిన ఘటన KPHB PS పరిధిలో జరిగింది. బాధితుల వివరాల ప్రకారం.. పవన్ అనే యువకుడు ఈనెల 6వ తేదీన ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయాడు. 2 రోజుల క్రితం తాను ఫోన్ చేసి అనారోగ్యంగా ఉందని పుణేలో తెలియని ప్రాంతంలో ఉన్నానని ఫోన్ స్విచ్డ్ ఆఫ్ చేశాడు. కుటుంబ సభ్యులు కాల్ చేయగా మహిళా ఫోన్ ఎత్తి ‘మీ కుమారుడికి కాల్ చేస్తే చంపేస్తా’అని బెదిరించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News February 20, 2025

HYD: లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి

image

మాసబ్‌ట్యాంక్ సోషల్ వెల్ఫేర్ ఆఫీస్‌లో ఏసీబీ అధికారుల సోదాలు చేశారు. ఎస్సీ, ఎస్టీ సెల్ జీఎం ఆనంద్ కుమార్ రూ.లక్ష లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెండ్‌గా అధికారులకు పట్టుబడ్డారు. ఆయనపై కేసు నమోదు చేసి ఏసీబీ అదుపులోకి తీసుకుంది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

error: Content is protected !!